Surya Gochar 2022: తులరాశిలో సంచరిస్తున్న సూర్యుడు.. ఈ 4 రాశులవారికి బంపర్ లాటరీ తగలడం పక్కా..!
Surya Gochar 2022: నిన్న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించాడు. తులారాశిలో శుక్రుని సంచారం 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Surya Gochar 2022: గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు నిన్న అంటే అక్టోబరు 17న తులరాశిలోకి ప్రవేశించాడు. దీనినే తుల సంక్రాంతి అంటారు. దీపావళికి ముందు సూర్యుడి రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వారి జీవితం అనుహ్యమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏ వ్యక్తి జాతకంలో సూర్యుడు శుభప్రదమైన స్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. రాగిపాత్ర నిండా నీటిని తీసుకుని సూర్యభగవానుడు అర్ఘ్యమిస్తే చాలు మిమ్మిల్ని వెంటనే అనుగ్రహిస్తాడు. తులరాశిలో సూర్య సంచారం (Surya Gochar 2022) ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి సూర్య సంచారం శుభప్రదం
వృషభం (Taurus): సూర్య సంచారం వృషభ రాశి వారి జీవితంలో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వీరు కెరీర్ లో గొప్ప పురోగతి సాధిస్తారు. కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
సింహరాశి (Leo): సూర్యుని రాశి మార్పు సింహ రాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో విజయం ఉంటుంది. అకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి.
ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశి వారు సూర్యుడి రాశిమార్పు చాలా శుభప్రదంగా ఉంటుంది. డబ్బు, పలుకుబడి, పదవి అన్నీ పొందుతారు. మీరు మీ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం.
మీనరాశి (Pisces): సూర్యుని సంచారం మీన రాశి వారికి బలమైన లాభాలను ఇస్తుంది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. వ్యాపారులు కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.
Also Read: Venus Transit 2022: ఇవాళే తులరాశిలో శుక్ర సంచారం, త్రికోణ రాజయోగం... ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook