Sun Transit Impacts on Youth: గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు ఇవాళ అంటే అక్టోబరు 17న కన్యారాశిని విడిచిపెట్టి తులరాశిలోకి (Sun transit in libra 2022) ప్రవేశించనున్నాడు. దాదాపు నెల రోజులపాటు అక్కడే ఉండనున్నాడు. ఎవరి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. సూర్యుడికి నీటితో అర్ఘ్యమిస్తే చాలు వెంటనే అనుగ్రహిస్తాడు. తులరాశిలో సూర్యుడి సంచారం యువతపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కొందరికి ఉద్యోగాలు వస్తాయి. మరికొందరు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ సూర్య సంచారం ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus)- ఈ రాశికి చెందిన యువతపై సూర్యప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్‌తో తక్కువ సమయం గడపడం మంచిది. లేదంటే వారి కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. తలనొప్పి కూడా రావచ్చు. 
మిథునం (Gemini)- మిథునరాశి చెందిన యువకులు ప్రభుత్వ అధికారులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. అవి భవిష్యత్తులో వారికి లాభిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో నిరాశకు గురువుతారు. ఇలాంటి సమయంలో సహనం కోల్పోకూడదు. 
కర్కాటకం (Cancer)- పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. వారు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక అవుతారు. ధూమపానానికి దూరంగా ఉండండి. 
సింహం (Leo)- మీ ఫ్యామిలీ సపోర్టుతో కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. యువత తమ లక్ష్యం పట్ల చిత్తశుద్ధితో నిమగ్నమై ఉండాలి మరియు ఒత్తిడికి గురికాకూడదు. 
ధనుస్సు (Sagittarius)- విద్యార్థులు తమ చదువులను కొనసాగించగలుగుతారు, అయితే ఈ సమయంలో వారు కొత్త అధ్యాయంతో పాటు పునశ్చరణపై దృష్టి పెట్టాలి. చదువు పూర్తి చేసి ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తున్న యువత కష్టానికి తగిన ఫలం దక్కే సమయం ఆసన్నమైంది.
కుంభం (Aquarius)- సూర్య  సంచారం వల్ల ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశికి చెందిన యువకుల కల ఫలిస్తుంది. త్వరలోనే వీరు జాబ్ లో చేరుతారు. 


Also Read: Jupiter Transit 2022: బృహస్పతి 'అఖండ సామ్రాజ్య యోగం'.. ఈ 3 రాశుల వారు కోట్ల ఆస్తులకు యజమానులవుతారు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook