Surya Gochar 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల రాశిచక్రం మార్పు అనేది ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ప్రతి నెలా ఏదో ఒక గ్రహ సంచారం ఉంటుంది. ఇది మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు అక్టోబరు 17న తన రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం కన్యారాశిలో ఉన్న ఆదిత్యుడు తులరాశిలోకి (Surya Gochar 2022) ప్రవేశించనున్నాడు. దీనినే తుల సంక్రాంతి అంటారు. తులరాశికి అధిపతి శుక్రుడు. సంపద, వైభవం, ప్రేమ, లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడి రాశిలో సూర్య సంచారం వల్ల మూడు రాశుల భవిష్యత్తు మారబోతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి(Aries): ఈ రాశివారిని సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడు. వీరికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. పాత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఉద్యోగ, వ్యాపారులు లాభపడతారు.
వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశి వారికి సూర్యుని సంచారం వల్ల సంపదలు సమకూరుతాయి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఆదిత్యుడి అనుగ్రహంతో వీరు ఇంక్రిమెంట్ లేదా బోనస్ పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. 
ధనుస్సు రాశి (Sagittarius): సూర్య భగవానుడి సంచారం వల్ల ఈ రాశివారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ రాశివారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ వర్క్ కి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది.


Also Read: Shukra Gochar 2022: తులరాశిలోకి శుక్రుడు.. మరో 9 రోజుల్లో మారనున్న ఈ రాశుల ఫేట్.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook