Sun Transit 2023: సూర్యుడి గోచారం రేపు అంటే మార్చ్ 15వ తేదీన మీనరాశిలో జరగనుంది. అంటే సూర్యుడి రాశి పరివర్తనం ఉంది. ఫలితంగా 4 రాశులవారికి బ్యాడ్ డేస్ ప్రారంభం కానున్నాయి. ధననష్టంతో పాటు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడిని గ్రహాల రారాజుగా పరిగణిస్తారు. సూర్యుడి రేపు అంటే మార్చ్ 15వ తేదీ బుధవారం ఉదయం మీన రాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుడు ఎప్పుడు మీనం లేదా కుంభరాశిలో ప్రవేశించినా ఆ సమయంలో ఏ విధమైన శుభకార్యం తలపెట్టడం మంచిది కానేకాదు. రాశి చక్రంలో మీనరాశి 12వ పాదంలో ఉంది. ఇది నీటి తత్వం కలిగింది. గ్రహాలకు గురువుగా భావించే గురుడు దీనికి అధిపతి.  సూర్యుడి మీనరాశి ప్రవేశం అంటే..సూర్యుడి గ్రహ పరివర్తనంలో చివరి గోచారం. మీనరాశికి చేరుకుంటూనే సూర్యుడు తన మొత్తం అహంకార వైఖరి, నెగెటివిటి తొలగించుకుని తిరిగి శక్తివంతుడౌతాడు. సూర్యుడి గోచారం కారణంగా 4 రాశుల జీవితంలో ఎగుడు దిగుడు ఉంటాయి. 


సూర్యుడి గోచారంతో ఏ రాశులపై దుష్ప్రభావం


కన్యా రాశి


సూర్యుడి మీనరాశి ప్రవేశం వల్ల వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జీవిత భాగస్వామితతో అనవసరపు గోడవలు జరగవచ్చు. ఇది విడాకుల వరకూ దారితీయవచ్చు. సంయమనంతో అన్ని పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి సారించాలి. అనవసరపు గొడవలు, వివాదాలకు దూరంగా  ఉంటే మంచిది. అధిక రక్తపోటు, మైగ్రెయిన్ సమస్య ఉత్పన్నం కావచ్చు.


సింహ రాశి


సూర్యుడి 8వ పాదంలో గోచారం వల్ల కష్టాలు మరింతగా పెరుగుతాయి. దీనివల్ల మిశ్రమ ఫలితాలు కూడా రావచ్చు. అత్తారింటి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ ఇబ్బందుల్ని చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. మీ కోపాన్ని నిగ్రహించుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి అవసరం. కన్ను, గుండె, ఎముకల సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు.


మేష రాశి


సూర్యుడి గోచారం వల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. విద్యార్ధులకు ఆత్మ విశ్వాసం లోపించవచ్చు. చదువుపై ఫోకస్ పెట్టాలి. జీవిత భాగస్వామితో పొరపొఛ్ఛాలు, అహంకారం కారణంగా వివాదం తలెత్తవచ్చు. ఫలితంగా మీ బంధంపై ప్రభావం పడుతుంది. చికిత్సకు ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.


మిధున రాశి


సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావంతో ఇంటి పరిస్థితి అస్సలు బాగుండదు. కుటుంబసభ్యుల ఆలోచనల్లో విభేదాలు, అహంకారం ఏర్పడవచ్చు. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత ఉండదు. తల్లి ఆరోగ్యం విషయం సమస్యగా ఉంటుంది. కొలెస్ట్రాల్, గుండె పోటు, రక్తపోటు సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఈ పరిస్థితుల్నించి ఉపశమనం పొందేందుకు రోజూ సూర్యుడికి జలాభిషేకం చేయాలి.


Also read: Sun Transit 2023: సూర్యుడి గోచారం ప్రభావం, పదోన్నతి, కొత్త ఉద్యోగాలు, ఊహించని ధనలాభం రేపట్నించే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook