Sun Transit 2023: సూర్యుడి రేపు అంటే మార్చ్ 15వ తేదీన కుంభ రాశి నుంచి బయటికొచ్చి మీన రాశిలో ప్రవేశించనున్నాడు. అంటే రేపు సూర్య గోచారముంది. సహజంగా ఈ ప్రభావం 12 రాశులపై పడవచ్చు. ముఖ్యంగా కన్యా రాశి జాతకులకు చాలా ప్రత్యేకంగా ఉండనుంది. పదోన్నతి, ఉద్యోగ మార్పు వంటి కీలక పరిణామాలుంటాయి.
సూర్యుడు కుంభరాశి నుంచి బయటికొచ్చి మీన రాశిలో ప్రవేశించేందుకు మరి కొద్ది గంటలే మిగిలింది. రేపు ఉదయం మీనరాశిలో ప్రవేశించే సూర్యుడు ఏప్రిల్ 14 వరకూ ఉంటాడు. సూర్యుడిని గ్రహాలకు రారాజుగా పిలుస్తున్నందున గోచారం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. మీనరాశి ప్రవేశం వల్ల కన్యా రాశి జాతకులకు చాలా బాగుంటుంది. ఊహించని ధనలాభం కలగనుంది.
సూర్యుడి గోచార సమయం ఒక్క నెలే. ఈ సమయంలో కన్యారాశి జాతకులకు జీవిత భాగస్వామి, మిత్రులు లేదా బంధువులు లేదా వ్యాపార భాగస్వామితో అకారణంగా కోప్పడవద్దు. మీ దృష్టిలో ఎవరైతే గొప్ప వ్యక్తులో వారి గౌరవ మర్యాదలు పెంచాలి. దీనివల్ల లాభముంటుంది. పని ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంతగా లాభముంటుంది. పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ మార్పైనా ఉంటుంది.
విద్య, క్రీడలు వంటి రంగాల్లో ఉన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తృతి చేసేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయం ఈ రంగాలకు అనువైన సమయం. మీ రంగంలో నిపుణులు లేదా పెద్దల నుంచి అవసరమైన మేరకు సలహాలు తీసుకోవాలి. భవిష్యత్తులో మీ వ్యాపారం పెంచేందుకు ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది.
విద్యార్ధులు చదువుపై ఫోకస్ పెట్టాలి. విద్యారంగంలో ఉద్యోగం చేయాలనుకునేవాళ్లు లేదా ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పర్సనాలిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రోజూ త్వరగా లేచేందుకు ప్రయత్నించాలి. కనీసం ఈ నెలైనా సూర్యాస్తమయం సమయంలో పడుకోకుండా ఉండాలి.
కుటుంబంలో వృద్ధుల్ని అంటే పెద్దవారిని గౌరవించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అగౌరవపర్చకూడదు. పెద్దలు అడిగింది కాదనుకూడదు. లేదా వారిచ్చే సలహా ఏదైనా ఉంటే పాటించాలి. ఎక్కువ ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు మీ ఆర్ధిక పరిస్థితిని బలహీనపరుస్తాయి. కడుపు సంబంధిత సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే మసాలా, కారం తిండి తగ్గించాలి. బయటి తిండి పూర్తిగా మానేయడం మంచిది.
Also read: Saturn transit 2023: మరో 7 నెలలు అక్టోబర్ 17 వరకూ ఈ 5 రాశులకు తిరుగేలేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook