Sun transit 2024: శ్రవణ నక్షత్రంలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి పట్టనున్న అదృష్టం..
Sun transit 2024: ప్రస్తుతం సూర్యభగవానుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. మరో నాలుగు రోజుల్లో భాస్కరుడు శ్రవణ నక్షత్రంలో ప్రవేశించబోతున్నాడు. దీంతో నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Surya Nakshatra Gochar 2024: పురాణాల ప్రకారం, ఇరవై రెండో నక్షత్రం శ్రవణం. త్వరలో ఈ నక్షత్రం మకర రాశిలోకి ప్రవేశించనుంది. ఈ నక్షత్రానికి ప్రభువు విష్ణువు. ఇప్పటికే మకరరాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. దీంతో జనవరి 24న సూర్యుడు శ్రవణ నక్షత్రంలో సంచరించబోతున్నాడు. అదే రాశిలో ఫిబ్రవరి 07న వరకు భాస్కరుడు ఉంటాడు. శ్రవణ నక్షత్రంలో సూర్యుని సంచారం కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది.
కన్య రాశి
శ్రవణ నక్షత్రంలో సూర్యుడు గోచారం వల్ల కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రభుత్వ అధికారులు సపోర్టు లభిస్తుంది.
తులారాశి
భాస్కరుడు సంచారం వల్ల తులారాశా వారు ఎనలేని ప్రయోజనాలను పొందబోతున్నారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో శుభవార్త వింటారు. మీరు వ్యాపార లేదా ఉద్యోగ నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది.
మేషరాశి
సూర్యుని సంచార ప్రభావం వల్ల ఉద్యోగులకు ప్రమోషన్‌కు లభిస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. జాబ్ మారడానికి ఇదే మంచి సమయం. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి
సూర్యుడి నక్షత్ర రాశి మార్పు వల్ల కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల సపోర్టు లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also read: Ram Mandir: బిగ్ స్క్రీన్ పై అయోధ్య రాముని సుమధుర ఘట్టం..టికెట్ ఎంతో తెలుసా!
Also read:Double Rajayoga 2024: 500 ఏళ్ల తర్వాత డబల్ రాజయోగం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter