Sun transit in Virgo: సూర్యుడి కన్యా రాశి ప్రవేశం, 3 రాశులకు తస్మాత్ జాగ్రత్త
Sun transit in Virgo: జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. ఎందుకంటే హిందూమతంలో గ్రహాలకు మహత్యముంది. గ్రహాల ప్రతి కదలిక మనిషి జీవితాన్ని ప్రబావితం చేస్తుందంటారు జ్యోతిష్య పండితులు. ప్రస్తుతం సూర్యుడి కన్యా రాశి ప్రవేశం ప్రభావం ఎలా ఉండనుందో పరిశీలిద్దాం..
Sun transit in Virgo: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రారాజుగా సూర్యుడిని పిలుస్తారు. సూర్యుడి కన్యా రాశిలో గోచారమైన కారణంగా ప్రతి రాశిపై ప్రభావం కన్పిస్తుంది. కొన్ని రాశులకు అనుకూలంగా, కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. వ్యాపారంలో 12 రాశులకు రానున్న నెల రోజులు ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
సూర్యుడు సెప్టెంబర్ 17వ తేదీన సింహ రాశి నుంచి కన్యా రాశిలే ప్రవేశించాడు. ఈ రాశిలో అక్టోబర్ 17 వరకూ అంటే నెలరోజులు ఉండనున్నాడు. కన్యా రాశిలో సూర్యుడు ప్రవేశిస్తూనే మేషం, వృషభం, మిథున రాశి జాతకుల వ్యాపారంపై ప్రభావం ఉంటుంది. ఆ వివరాలు, ఏ రాశికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
వృషభ రాశి జాతకులకు వ్యాపారంలో ఈ సమయం చాలా కష్టంగా ఉంటుంది. పూర్వీకుల నుంచి వస్తున్న వ్యాపారమైతే వారి సూచనల ప్రకారం వ్యాపారం కొనసాగిస్తే మంచి ఫలితాలు రావచ్చు. ఉద్యోగస్థులకు సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. ఆర్ధికంగా ఇబ్బందికర పరిణామాలుంటాయి.
మిథున రాశి జాతకులకు సూర్యుడి కన్యా రాశి ప్రవేశం కారణంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారం చేయాలి. ఉద్యోగులు కూడా పనిచేసే చోట ఎవరితోనూ వివాదం లేదా వాదనకు దిగకుండా తమ పని తాము చేసుకునిపోవాలి. ప్రభుత్వ పనులేమైనా ఉంటే సెప్టెంబర్ 30లోగా పూర్తి చేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల మేష రాశి జాతకులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రుణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి అదృష్టం మీ భాగస్వామి రూపంలో వస్తుంది. ఏదైనా పెట్టుబడి లేదా కొత్త వ్యాపారం కోసం ఆలోచిస్తుంటే ఈ సమయం మంచిది కాదు. నెలరోజులు ఆగిపోవల్సిందే. మొత్తానికి వ్యాపారులు, ఉద్యోగులకు అంతగా అనువైన సమయం కాదిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
Also read: Mars Transit 2023: మంగళ గ్రహం అస్తమయంతో ఈ 3 రాశులకు సెప్టెంబర్ 24 నుంచి అంతా నరకమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook