Sun Transit 2023: కేవలం మరో 5 రోజుల్లో ఈ 5 రాశులకు దశ తిరగడం ఖాయం, వద్దంటే డబ్బు
Sun Transit 2023: ఖగోళ ప్రపంచంలో గ్రహాల రాజుగా పిలిచే సూర్యుడిని ఆత్మ కారకుడిగా కూడా చెబుతారు. అందుకే సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. సూర్యుడి మీనరాశి గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..
జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఏదో ఒక రాశిలో ప్రవేశించడాన్నే గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తారు. ఈ ప్రభావం అన్ని రాశులపై పడినా కొన్ని రాశులపై అనుకూలంగా మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. మార్చ్ 15న సూర్యుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.
మార్చ్ 15వ తేదీన సూర్యుడు గురుడి రాశిగా భావించే మీన రాశిలో గోచారం చేయనున్నాడు. ఈ రెండు గ్రహాలు జ్యోతిష్యం ప్రకారం అత్యంత శక్తివంతమైనవి. సూర్యుడి గోచారం ముఖ్యంగా 5 రాశుల జీవితంలో సకారాత్మకంగా ఉంటుంది. సూర్యుడి గోచారంతో ఈ రాశుల అదృష్టం మెరిసిపోనుంది. జీవితంలో ఆనందం ఉంటుంది. ఇంకో 5 రోజుల్లో ఈ ఐదు రాశుల జీవితమే మారిపోనుంది. ఎంత డబ్బు వస్తుందంటే..లెక్కపెట్టుకోలేక అలసిపోతారు.
వృశ్చిక రాశి
సూర్యుడి గోచారం ప్రభావం వృశ్చిక రాశి జాతకులపై అత్యద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం చూస్తుంటే మీ కోర్కె నెరవేరుతుంది. ఈ కాలంలో ఆర్ధిక ప్రయోజనం కలగడమే కాకుండా జీతం కూడా పెరుగుతుంది. విద్యార్ధులకు ఈ సమయంలో మెరుగైన ప్రతిఫలం లభిస్తుంది. విజయానికి అనేక మార్గాలు తెర్చుకుంటాయి.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఊహంచని ధనలాభముంటుంది. కొత్త వాహనం లేదా సంపద కొనుగోలు చేయవచ్చు. ఈ గోచారం వృషభ రాశివారికి అత్యంత శుభ సూచకం కానుంది. కొత్త పెట్టుబడులకు ఆస్కారముంటుంది. దంపతులు శుభవార్త వింటారు.
కర్కాటక రాశి
సూర్యుడి గోచారం కారణంగా ఈ సమయంలో కర్కాటక రాశి జాతకుల ఆసక్తి ఆధ్యాత్మికత వైపు ఉంటుంది. తండ్రి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఏదైనా ధార్మిక ప్రదేశానికి వెళ్లవచ్చు. పనిచేసేచోట ప్రత్యర్ధులు సైతం ఏం చేయలేరు. వృత్తిరీత్యా ఈ సమయం చాలా మంచిది.
మీనరాశి
సూర్యుడి గోచారం లేదా రాశి పరివర్తనం ఇదే మీన రాశిలో ఉండటంతో ఈ జాతకులకు అదృష్టం పూర్తిగా మారిపోనుంది. నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం మెరుగౌతుంది. ఇతరులు మీ మాటలతో ప్రభావితులౌతారు. ఈ సమయంలో ఇతరులు ఇచ్చే సలహాల్ని వినాలి. పనిచేసేచోట మీకు అనుకూలంగా ఉంటుంది. పదోన్నతి లభిస్తుంది.
మిధున రాశి
సూర్యుడి గోచారం ప్రభావంతో మిధున రాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది. కెరీర్ విజయవంతంగా ఉంటుంది. మీరేంటనేది రుజువు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులైతే పదోన్నతి పొందుతారు. సోదర సోదరీమణులతో కలిసి ఏదైనా వ్యాపారం ప్రారంభించవచ్చు. ఆర్ధికంగా బాగా లాభపడతారు.
Also read: Lunar Eclipse 2023:సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఆ రోజునే..సూతకం గురించి తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook