Lunar Eclipse 2023:సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఆ రోజునే..సూతకం గురించి తెలుసా?

Lunar Eclipse 2023 Date:  ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరగడానికి మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉండగా అందులో చంద్ర గ్రహణం గురించి కీలక విషయాలు మీ ముందుకు తీసుకు వస్తున్నాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 9, 2023, 02:26 PM IST
Lunar Eclipse 2023:సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఆ రోజునే..సూతకం గురించి తెలుసా?

Chandra Grahanam 2023 Date and Time in India: 2023 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవించనున్నాయి. ఆ గ్రహణాలలో 2 సూర్యగ్రహణాలు కాగా మరియు 2 చంద్ర గ్రహణాలు . హిందూ మతం అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే గ్రహణ కాలంలో కొన్ని పనులు నిషిద్ధమని హిందూ వర్గాల వారు భావిస్తారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో సూతకం అని కూడా పరిగణించబడుతుంది. ఈ సూతక కాలంలో కొన్ని నియమాలు పాటించాలి. 2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో అలాగే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5, శుక్రవారం నాడు ఏర్పడనుంది. అదే సమయంలో, దానికి 15 రోజుల ముందు, సంవత్సరంలో సూర్యగ్రహణం ఉంటుంది. 15 రోజుల వ్యవధిలో 2 గ్రహణాలు సంభవించడం ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చంద్రగ్రహణం మే 5న వైశాఖ పూర్ణిమ నాడు రానుంది, దీనిని బుద్ధ పూర్ణిమ అని కూడా అంటున్నారు. భారతదేశంలో చంద్రగ్రహణం సమయం గురించి చెప్పాలంటే మే 5 రాత్రి 8.45 గంటలకు జరగనుంది, అది అర్ధరాత్రి 1 గంటల వరకు ఉంటుంది. ఈ విధంగా, చంద్రగ్రహణం వ్యవధి సుమారు 4 గంటల 15 నిమిషాలు ఉంటుంది. 

చంద్రగ్రహణం రోజున సూతకం జరుగుతుందా లేదా అనే విషయంపై ప్రజలు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఈ సంవత్సరం చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి దాని సూతక కాలం మన దగ్గర చెల్లదు. లేకపోతే, సూతక కాలంలో దేవాలయాల తలుపులు మూసి ఉంచుతారు. ఈ సమయంలో, ఏదైనా తినడం, త్రాగడం కూడా నిషేధించబడింది. ముఖ్యంగా గర్భిణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ఇది మొత్తం 12 రాశుల మీద తక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు. 

ఈ ప్రదేశాలలో చంద్రగ్రహణం కనిపిస్తుంది

మే 5న జరగబోయే సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా, అట్లాంటిక్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ మరియు పశ్చిమ ఐరోపా, ఆఫ్రికా మరియు పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కనిపించనుంది. ఇక అదే సమయంలో, 2023 సంవత్సరం రెండవ చంద్ర గ్రహణం అక్టోబర్ 28 న జరుగుతుంది. ఈ చంద్రగ్రహణం 2023 సంవత్సరంలో చివరి గ్రహణం అవుతుంది. ఈ గ్రహణాన్ని యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, తూర్పు అమెరికా మరియు ఆఫ్రికాలో చూడవచ్చని అంటున్నారు. 
Also Read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!

Also Read: Satish Kaushik Death: గర్భవతిగా ఉన్న నటిని వివాహం చేసుకుంటానన్న నటుడు మృతి.. అసలు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News