Surya Gochar 2023: తులరాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడు.. ఈ 4 రాశులను వరించనున్న అదృష్టం..
Sun transit 2023: ప్రతి నెలా సూర్యుడు తన రాశిని మారుస్తాడు. వచ్చే నెలలో సూర్యుడు కన్యారాశిని వదిలి తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
Surya Gochar 2023 in October: నెలకొకసారి సూర్యదేవుడు తన రాశిని మారుస్తాడు. ఇలా సంవత్సరం మెుత్తం 12 రాశులలో సంచరిస్తాడు. సూర్యుడి దేవుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ప్రస్తుతం సూర్యభగవానుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 18న సూర్యుడు కన్యారాశి నుంచి బయటకు వెళ్లి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం నవంబర్ 17న సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో సూర్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
కుంభ రాశి
సూర్యుని రాశి మార్పు కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
కన్య రాశి
ఈ రాశి యెుక్క డబ్బు ఇంట్లో సూర్యుడు సంచరించబోతున్నాడు. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుుతంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో సక్సెస్ అవుతారు. వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రాశి యెుక్క ఆదాయ గృహంలో సూర్యుడు సంచరిస్తాడు. దీంతో ధనస్సు రాశి వారి కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ సంపద పెరిగే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
మకరరాశి
సూర్యుడి సంచారం మకరరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీరు ఊహించనంత ధనాన్ని పొందుతారు.
Also Read: Saturn transit 2023: నవంబరు నుంచి ఈ 4 రాశులకు పట్టిన దరిద్రం పోతుంది.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి