Sun In Cancer Zodiac sign: ప్రతి నెల సూర్యభగవానుడు రాశిని మారుస్తాడు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. జూలై 16, 2023 ఉదయం 04.59 గంటలకు మెర్క్యూరీ తన రాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆగస్టు 17 వరకు ఆదిత్యుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి మరియు సూర్యుడికి మిత్రుడు. కర్కాటకంలో సూర్యుడి సంచారం వల్ల మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
కర్కాటక రాశిలో సూర్యుని సంచారం మేషరాశి వారికి కలిసి వస్తుంది.  ఈ సమయంలో మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరాశి వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. చదువులో రాణిస్తారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు వారు కెరీర్ లో ఉన్నత స్థానానికి వెళతారు. 
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో సూర్యుని సంచారం వల్ల ఈ రాశివారు అనుకూల ఫలితాలు పొందుతారు. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం బాగుంటుంది. 


Also Read: Budh Surya Yuti 2023: జూలై 17న అరుదైన కలయిక.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..


తులారాశి
తుల రాశి వారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ జీతంలో పెరుగుదల ఉంటుంది. సూర్య సంచారం మీకు మంచి ప్రయోజనాలను ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 


Also Read: Shani Retrograde 2023: రివర్స్ లో కదులతున్న శని.. ఇక ఈ రాశుల వారికి కష్టాలు షురూ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook