Budhaditya Rajyog In Pisces 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు పర్టికల్ టైం తర్వాత రాశిని మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మరియు గ్రహాలకు అధిపతి అయిన బుధుడు కలయిక వల్ల మార్చి 16న బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం మూడు రాశులవారు ఆకస్మిక ధనలాభం, పలుకుబడి, గౌరవం లభిస్తాయి. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధాదిత్య రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
వృశ్చిక రాశిచక్రం
బుధాదిత్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆడ్మిషన్ పొందుతారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది.
ధనుస్సు రాశిచక్రం
బుధాదిత్య రాజయోగం ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు మంచి ఆర్డర్లు పొందుతారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఉద్యోగం మారాలనే కోరిక నెరవేరుతుంది. 
మీన రాశిచక్రం
బుధాదిత్య రాజయోగం మీనరాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ యోగం మీ లగ్నంలోనే ఏర్పడుతోంది. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాటతీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ లైఫ్ పార్టనర్ తో సంబంధాలు బాగుంటాయి. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రతి శనివారం శనిదేవుని ఆలయానికి వెళ్లి ఆవనూనె దీపం వెలిగించి శని చాలీసా పఠించడం వల్ల మీకు ఇతర సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. 


Also Read: Rahu-Ketu Gochar 2023: రాహు-కేతు గోచారం.. ఈ 4 రాశుల జీవితం కష్టాలమయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook