Rahu-Ketu Gochar 2023: రాహు-కేతు గోచారం.. ఈ 4 రాశుల జీవితం కష్టాలమయం..

Rahu-Ketu Gochar 2023: దుష్ట గ్రహాలైన రాహు, కేతువులు త్వరలో తమ రాశులను ఛేంజ్ చేయనున్నాయి. దీంతో నాలుగు రాశులవారి జీవితం కష్టాలమయం కానుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2023, 10:01 AM IST
Rahu-Ketu Gochar 2023: రాహు-కేతు గోచారం.. ఈ 4 రాశుల జీవితం కష్టాలమయం..

Rahu-Ketu Rashi Parivartan 2023: జ్యోతిష్యశాస్త్రంలో రాహువు మరియు కేతువులను ఛాయా గ్రహాలుగా భావిస్తారు. ఈ రెండు దుష్ట గ్రహాల రాశి మార్పు ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది. రాహువు మరియు కేతువులు ఎల్లప్పుడూ తిరోగమన దిశలో సంచరిస్తూ ఉంటాయి. ఈ రెండు గ్రహాలు ఏడాదిన్నరకు ఒకసారి రాశిని ఛేంజ్ చేస్తాయి. అక్టోబరు 30న రాహు-కేతువులు మీనరాశిలో సంచరించనున్నాయి. దీంతో నాలుగు రాశులవారికి కష్టాలు మెుదలుకానున్నాయి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

రాహు-కేతు సంచారం ఈ రాశుల జీవితం కష్టాలమయం
మేషరాశి (Aries)
రాహు-కేతువుల సంచారం మేష రాశి వారి కష్టాలను పెంచుతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మేషరాశి వారిని అనేక రకాల సమస్యలు చుట్టముడతాయి. భార్యతో విభేదాలు రావచ్చు. 
వృషభం (Taurus)
రాహు-కేతువుల సంచారం కూడా వృషభ రాశి వారికి బాధను కలిగిస్తుంది. అడుగడుగునా సమస్యలు ఎదురువుతాయి. మీ ఖర్చులు పెరుగుతాయి. మీ కుటుంబంలో విభేదాలు వస్తాయి. దీంతో మీ కష్టాలు మరింత పెరుగుతాయి.  
కన్య రాశి (Virgo)
రాహు-కేతువుల గోచారం కన్యారాశి వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. మీకు ప్రతి రంగంలో సమస్యలు వస్తాయి. ఉద్యోగం మరియు వ్యాపారంలో నష్టాలను చవిచూస్తారు. ఇతరులతో సంబంధాలు బాగుండవు. 
మీనరాశి (Pisces)
మీన రాశి ప్రజలను ఇబ్బందులు చుట్టుముడతాయి. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించడం కష్టం. సంతానం కోసం మరింత కాలం వేచిచూడాల్సి  ఉంటుంది. అనవసర వాటికి డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. 

Also Read: Grah Gochar: చైత్రమాసంలో పంచగ్రహాల కలయిక.. ఈ రాశులకు లాటరీ పక్కా.. ఇందులో మీ రాశి ఉందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News