COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surya and Mangal Yuti 2023: నవంబర్‌ నెలలో చాలా గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అందుకే ఈ నెలకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. తులారాశిలో గ్రహాల రాజు సూర్యుడు, అంగారకుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి వ్యక్తిగత జీవితాల్లో  ధైర్యం, శ్రమ, బలంలో చాలా రకాల మార్పులు వస్తాయి. కుజుడు నవంబర్ 16న, సూర్యుడు నవంబర్ 17న తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక శుభ ప్రభావం పడుతుంది. ఈ రెండు గ్రహాలు సంచారం చేయడం వల్ల ఏయే రాశుల వారు శుభవార్తాలు వింటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


మేష రాశి:
కుజుడు-సూర్యుడి కలయిక కారణంగా మేషరాశి వారికి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నవంబర్ 16 నుంచి వీరికి అదృష్టం కలిసి వస్తుందని, దీని కారణంగా ఇంతక ముందు నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుజుడు కలయిక కారణంగా మేష రాశి వారికి కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


సింహ రాశి:
సింహ రాశివారికి సూర్యుడు, కుజుడి కలయిక వల్ల అద్భుతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో మీ అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఈ సూర్యుడు-అంగారకుడి కలయిక కారణంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. 


వృశ్చిక రాశి:
ఈ రెండు గ్రహాల కలయిక వృశ్చిక రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు డబ్బును కూడబెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. ఇక ఆర్థికంగా బలపడడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇక ఉద్యోగాలు చేసేవారు  కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook