Neechbhang Rajyog: సూర్యుడి `నీచభంగ రాజయోగం`.. ఈ 3 రాశులవారికి ఊహించనంత ధనం...
Sun Made Neechbhang Rajyog: ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్య దేవుడు తులారాశిలోకి ప్రవేశించాడు. దానివల్ల నీచభంగ రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం మూడు రాశులవారికి ఊహించని ధనాన్ని ఇస్తుంది.
Surya Dev Made Neechbhang Rajyog: వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం మారినప్పుడు లేదా తిరోగమనం చెందినప్పుడు దాని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. ప్రస్తుతం సూర్యభగవానుడు తులరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా నీచభంగ రాజయోగం (Sun Made Neechbhang Rajyog) ఏర్పడుతుంది. ఈ రాజయోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. వీరు కెరీర్ మరియు వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటక రాశి (Cancer): నీచభంగ రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకం యెుక్క నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీని కారణంగా ఈ సమయంలో మీరు వాహనం మరియు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు.
తుల (Libra): నీచభంగ రాజయోగం వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యోగం మీ సంచార జాతకంలో లగ్నస్థానంలో ఏర్పడుతోంది. దీంతో మీరు మీ రంగంలో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.
మకరం (Capricorn): మీ రాశి యెుక్క పదో స్థానంలో రాజయోగం ఏర్పడుతోంది. దీంతో మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. బిజినెస్ విస్తరిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆగిపోయిన ప్రాజెక్టు పూర్తవుతుంది. పెళ్లికాని ప్రసాద్ లకు వివాహ ప్రతిపాదనను రావచ్చు. ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
Also Read: Kendra Tirkon Rajyog: అరుదైన యోగాన్ని సృష్టించిన శుక్రుడు... ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook