Trigrahi Yogam 2024: న్యూ ఇయర్ లో మకరరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..
Trigrahi Yogam in 2024: కొత్త సంవత్సరం ప్రారంభంలో కొన్ని గ్రహ రాశుల గమనంలో పెను మార్పు రాబోతోంది. దీని కారణంగా అరుదైన యోగం ఏర్పడబోతోంది. ఇది ఏ రాశులవారికి లాభాలను ఇవ్వనుందో తెలుసుకుందాం.
Surya Budh and Mangal yuti in Capricorn 2024: వచ్చే ఏడాది ప్రారంభంలో మకరరాశిలో కుజుడు, సూర్యుడు మరియు బుధ గ్రహాల కలయిక ఏర్పడబోతుంది. దీని కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం రూపొందుతోంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. త్రిగ్రాహి యోగం వల్ల 2024లో ఏయే రాశులవారికి అదృష్టం పట్టనుందో తెలుసుకుందాం.
త్రిగ్రాహి యోగం ఈ రాశులకు వరం
మకరం: ఈ రాశి యెుక్క లగ్న గృహంలో కుజుడు, సూర్యుడు మరియు బుధ గ్రహాల కూటమి ఏర్పడబోతోంది. మీ కోరికలు నెరవేరుతాయి. దీంతో ఈ రాశి వారు ఊహించనంత డబ్బును పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు.
తుల రాశి: త్రిగ్రాహి యోగం కారణంగా తులరాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీకు తాతముత్తాతల ఆస్తులు లభిస్తాయి. మీకు ప్రతి పనిలో ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. జాబ్ చేసేవారికి శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడావస్తుంది. వ్యాపారస్తులకు బాగా లాభాలు ఉంటాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగస్తుల బాధ్యతలు పెరుగుతాయి.
వృషభం: వృషభ రాశి వారికి త్రిగ్రహ సమావేశం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఆఫీసులో మీ వర్క్ కు ప్రశంసలు లభిస్తాయి. మీరు ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: Astrological Prediction: 2024లో ఈ 4 రాశుల వారి కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి