Tirgrahi Yog: వృశ్చిక రాశిలో త్రిగ్రాహి యోగం.. వీరికి మంచి రోజులు ప్రారంభం..
Tirgrahi Yog effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వృశ్చిక రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 3 రాశుల వారికి ఆర్థికంగా మేలు చేస్తుంది.
Tirgrahi Yog In Vrashika Rashi: ఆస్ట్రాలజీ ప్రకారం, త్రిగ్రాహి యోగానికి చాలా విశిష్టత ఉంది. నవంబరు 16న సూర్యుడు, శుక్రుడు మరియు బుధుడు కలిసి వృశ్చికరాశిలో త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. నవంబరు 11న శుక్రుడు, నవంబరు 13న బుధుడు మరియు నవంబరు 16న సూర్యుడు వృశ్చిక రాశిలో కలిసి త్రిగ్రాహి యోగాన్ని (Tirgrahi Yog) ఏర్పరచనున్నాయి. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ఈ యోగం మూడు రాశులవారికి కెరీర్ లో పురోగతితోపాటు అపారమైన ధనాన్ని ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
తుల (Libra): త్రిగ్రాహి యోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుంది. దీని కారణంగా మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.
సింహం (Leo): త్రిగ్రాహి యోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. మీరు అన్ని సుఖాలను పొందుతారు. అలాగే మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వ్యాపారులు లాభపడతారు. పెట్టుబడి పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
కుంభం (Aquarius): త్రిగ్రాహి యోగం కుంభ రాశి వారికి వృత్తి మరియు వ్యాపార పరంగా లాభిస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి పదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు కొత్త జాబ్ ను పొందే అవకాశం ఉంది. ఆఫీసులో మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. లక్ కలిసి వచ్చి మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
Also Read: Pradosh Vrat 2022: సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి