Pradosh Vrat 2022: సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత

Pradosh Vrat November 2022: త్రయోదశి వ్రతం ఆచరించనట్లయితే శివుడు ప్రసన్నుడు అవుతాడని హిందువులు నమ్ముతారు. సాధారణంగా త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా పిలుస్తారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 12:19 PM IST
Pradosh Vrat 2022: సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత

Som Pradosh Vrat November 2022: అగ్రహాయన (మార్గశిర) మాసం యొక్క మొదటి ప్రదోషం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కృష్ణ పక్షం త్రయోదశి రోజున ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఈసారి ప్రదోష వ్రతం సోమవారం వస్తుంది కాబట్టి దీనిని సోమ ప్రదోష వ్రతం (Som Pradosh Vrat) అంటారు. ఈరోజున శివారాధన చేస్తారు. ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో చేసినట్లయితే ధనధాన్యాలు, భోగభాగ్యాలు వేటికీ కొదవ ఉండదు. అగ్రహాయన మాసంలో మొదటి సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు, శుభ సమయం మరియు పరిహారాలు గురించి తెలుసుకుందాం.

సాధారణంగా ప్రతినెలలో రెండు ప్రదోషాలు ఉంటాయి. ఒకటి కృష్ణ పక్ష ,రెండోది శుక్లపక్షం. ఈసారి మార్గశిర మాసం మెుదటి ప్రదోష వ్రతం నవంబర్ 21న జరుపుకోనున్నారు. ప్రదోష వ్రతాన్ని సంధ్యా కాల సమయంలో జరుపుకుంటారు. ఈ సమయంలో మహాదేవుడు నృత్యచేస్తారని.. దేవతలు ఆయనను పూజిస్తారని భక్తులు విశ్వసిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, కృష్ణ పక్షం యొక్క త్రయోదశి తిథి నవంబర్ 21, 2022 ఉదయం 10.07 నుండి ప్రారంభమై... 22 నవంబర్ 2022 ఉదయం 08:49 గంటలకు ముగుస్తుంది. పూజ సమయం - సాయంత్రం 05:34- రాత్రి 08:14

సోమ ప్రదోష వ్రత పరిహారం
>> శివుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రదోష కాల సమయంలో శంకరుని పంచామృతంతో అభిషేకం చేయండి.ఇలా చేయడం వల్ మీ జాతకంలోని చంద్ర దోషం తొలగిపోతుంది.  
>> సంతానం లేని దంపతులు ఈ రోజున శివలింగంపై బార్లీని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల యోగ్యమైన సంతానం కలుగుతుందని అంటారు. 
>> ఈ రోజు భోలేనాథ్‌కు నెయ్యితో అభిషేకం చేయండి. సాయంత్రం పూట శివతాండవ స్తోత్రాన్ని పఠించడం శుభ ఫలితాలను ఇస్తుంది. దీంతో మీ ఆత్మవిశ్వాసంతోపాటు సంపద కూడా పెరుగుతుంది. 

Also Read: Navpancham Rajyog: 12 ఏళ్ల తరువాత 'నవ పంచమ రాజయోగం'.. ఈ 3 రాశుల వారికి ధనలాభం... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News