Surya Gochar 2023: ఉన్నతమైన రాశిలోకి సూర్యభగవానుడు.. మే 15 వరకు ఈ 4 రాశులవారు జాగ్రత్త..
Surya Gochar 2023: సూర్యభగవానుడు వచ్చే నెలలో మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. ఆదిత్యుడి యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారిని ఇబ్బంది పెట్టనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: జ్యోతిషశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాల రాజుగా పిలుస్తారు. సూర్యుడి అనుగ్రహం లేకుండా మీరు కెరీర్ లోఉన్నత స్థానానికి చేరుకోలేరు. మీ జాతకంలో సూర్యభగవానుడు శుభస్థానంలో ఉంటే మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సూర్యభగవానుడు ఏప్రిల్ 14, 2023 మధ్యాహ్నం 02:42 గంటలకు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే రాశిలో ఆదిత్యుడు మే 15 వరకు ఉంటాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు కొందరిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
సూర్య సంచారం ఈ రాశులకు నష్టదాయకం
వృషభం
వృషభ రాశి యెుక్క నాల్గవ ఇంటికి సూర్యుడు అధిపతి మరియు పన్నెండవ ఇంట్లో కూర్చుంటాడు. సూర్యభగవానుడు మీకు చాలా సమస్యలను ఇస్తాడు. అంతేకాకుండా మీరు చాలా ధన నష్టాన్ని ఎదుర్కోంటారు. మీ ఖర్చులు పెరుగుతాయి. మీకు కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి.
కన్య
కన్య రాశి యెుక్క పన్నెండవ ఇంటికి సూర్యుడు అధిపతి. మీరు కెరీర్ లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కోంటారు. మీకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో భారీగా నష్టం వస్తుంది. మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీ ఖర్చులు ఎక్కువ అవుతాయి.
తులారాశి
తుల రాశి యెుక్క పదకొండవ ఇంటికి సూర్యుడు అధిపతి. ఈ సమయంలో తుల రాశి వారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు. కెరీర్ లో అడ్డంకులు వస్తాయి. ప్రయాణాలు కలిసి రావు. వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు ఆకస్మిక ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
మకరరాశి
మీ రాశి యెుక్క ఎనిమిదో ఇంటికి సూర్యుడు అధిపతి. ఈ సమయం మీ కెరీర్ కు అనుకూలంగా ఉండదు. మీకు పనిలో ఒత్తిడి ఉంటుంది. బిజినెస్ లో భారీగా నష్టాలు వస్తాయి. ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వస్తాయి.
Also Read: Neechbhang Rajyog 2023: 50 సంవత్సరాల నీచ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.