Surya Gochar 15th June 2023 effect: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. రెండు రోజుల కిందట అంటే జూన్ 15న ఆదిత్యుడు మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. విజయం మరియు గౌరవానికి కారకుడిగా సూర్యుడిని భావిస్తారు. జెమినిలో భానుడు సంచారం నాలుగు రాశులవారికి మంచి ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
మేషరాశి వారికి సూర్యుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థికంగా బలపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. 


సింహరాశి
సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించడం సింహ రాశి వారికి లాభాలను ఇస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. 


కన్యా రాశి
కన్యా రాశి వారికి సూర్య సంచారం కలిసి వస్తుంది. మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఊహించని ధనలాభం పొందుతారు. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. 


Also Read: Jupiter Rise 2023: 'మహాధన రాజయోగం' చేస్తున్న బృహస్పతి.. ఏడాదిపాటు ఈ రాశులకు భారీగా మనీ..


కుంభ రాశి
సూర్య సంచార ప్రభావం కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది. 


Also Read: Mars transit 2023: జూలై 01న అంగారక సంచారం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి