Surya Gochar 2023: పలు ముఖ్యమైన గ్రహాలు మార్చి నెలలో సంచారం చేయబోతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో మార్చి నెలకు ఎంతో ప్రముఖ్యత ఉంది. ఈ నెల 15వ తేదిన గ్రహాలకు రాజు సూర్యుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేయనుంది. ఇలా సంచారం చేసే క్రమంలో మీన్ సంక్రాంతి ఏర్పడబోతోంది. అయితే కుంభ రాశిలోని శని గ్రహం ఉండడంతో సూర్యుడు కూడా కలబోతున్నాడు. దీంతో అరుదైన దశ ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా మీన రాశిలోకి కూడా త్వరలో సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. ఇదే గ్రహంలో బృహస్పతి కూడా ఉండడం వల్ల ఈ రెండు రాశుల కలయికలు కూడా జరగబోతున్నాయి. దీంతో సూర్య సంచారం దశ అన్ని రాశులవారిపై ప్రభావం చూపబోతోంది. ఈ క్రమంలో మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు.


ఈ రాశుల వారికి సూర్య సంచారం శుభప్రదంగా ఉండబోతోంది:
వృషభం:

మీనరాశిలో సూర్యుడు సంచారం చేసి బృహస్పతి కలయిక వల్ల వృషభ రాశి వారికి శుభ ఫలితాలను కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశివారికి ఉద్యోగాల పరంగా మంచి జీతాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్ పొందే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో ఇతరుల పట్ల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర నష్టాల పాలవుతారు.


మిథునరాశి:
మిథునరాశి రాశివారికి సూర్యుని సంచారం శుభప్రదంగా, ఫలప్రదంగా ఉండబోతోంది. వీరు ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా అదృష్టాన్ని కూడా పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ క్రమంలో చాలా లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నరు. ఈ సంచార క్రమంలో పెట్టుబడులు పెడితే ఊహించని స్థాయిలో లాభాలు పొందుతారు. ఈ రాశివారు సంచార ప్రభావంలో విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశాలున్నాయి.


కర్కాటక రాశి:
సూర్యుడు, బృహస్పతి కలయిక కర్కాటక రాశి వారికి అదృష్టం విపరీతంగా రాబోతోంది. ముఖ్యంగా ఈ క్రమంలో వ్యాపార వేత్తలు పాత పెట్టుబడుల్లో కూడా లాభాలు పొందుతారు. సంపాదన కూడా పెరిగే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కుటుంబంలో కొత్త సభ్యులు కూడా వస్తారు.


ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు


ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook