Surya Gochar 2023: వృషభరాశిలోకి సూర్యగ్రహం సంచారం, మే 15 నుంచి ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం!
Surya Rashi Parivartan 2023 Effect: సూర్యగ్రహం మే 15న వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Rashi Parivartan 2023 Effect: సూర్యుడిని జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజుగా భావిస్తారు. అయితే ప్రతి సంవత్సరంలో అన్ని గ్రహాలు 10 నుంచి 20 సార్లు రాశి సంచారాలు చేస్తూ ఉంటాయి. సూర్యగ్రహం కూడా మే 15 ఉదయం 11.32 గంటలకు వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచారం మంచి సమయంలో జరిగితే అన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. లేకపోతే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం వల్ల ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశులవారిపై సూర్య గ్రహ సంచార ప్రభావం:
కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి సూర్యుడు రెండవ స్థానంలో ఉంటూ వృషభరాశిలోకి సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ రాశివారు ఎలాంటి కోరికలు కోరుకున్న నెరవేరుతాయి. అంతేకాకుండా వీరు మంచి స్నేహితులను కలుసుకునే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సమాజంలోని ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి ఈ సూర్య సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో ఏ రంగంలో వీరు పనులు చేసిన అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
Also Read: May Grah Gochar 2023: రాబోయే 18 రోజుల్లో ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా?
కన్యారాశి:
కన్యారాశి వారిపై కూడా సూర్యగ్రహ సంచారం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశివారు సంచార ప్రభావంతో ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. వాటికి సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొంటారు. ఫలితంగా మీరు సమాజంలో గౌరవం పొందుతారు. అంతేకాకుండా ఈ రాశివారు ఉద్యోగంలో బదిలీ కూడా చేస్తారు. ఆర్థిక పరమైన విషయాల పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. లేకపోతు తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉంది.
సింహరాశి:
సింహరాశి వారికి సూర్యగ్రహ సంచారం పదవ స్థానంలో ఉంటుంది. ఈ రాశివారికి సూర్యుడు అధిపతిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రాశివారిపై ప్రత్యేకంగా ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నవారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి పనులు చేసిన ఈ రాశివారు విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read: May Grah Gochar 2023: రాబోయే 18 రోజుల్లో ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook