Surya Gochar April 2023: ఏప్రిల్ 14న సూర్యుడు- రాహువుల కలయిక.. ఈ రాశులవారి దశ తిరగబోతోంది
Sun Transit 2023: ఏప్రిల్ 14న మేషరాశిలో జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న రెండు పెద్ద గ్రహాల కలయికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారి జీవితంలో మార్పులు చేర్పులు జరుగుతాయి.
Mesh Sankranti 2023: సూర్యగ్రహం ఏప్రిల్ 4న మీన రాశిని వదిలి మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇలా సంచారం చేయడాన్నే మేష సంక్రాంతి (Aries Sankranti 2023) అని కూడా అంటారు. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని ప్రత్యక్ష దేవుడుగా భావిస్తారు. కాబట్టి గ్రహాలకు రారాజుగా పిలుస్తారు. కాబట్టి సూర్యుడు రాశి సంచారం చేసినప్పుడు పలు రాశులవారి జీవితాల్లో మార్పులు చేర్పులు కలుగుతాయి. అయితే సూర్య గ్రహ ప్రభావం వ్యక్తుల రాశులపై సానుకూలంగా ఉంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. లేకపోతే నష్టాలు తప్పవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఏప్రిల్ 14న మేషరాశిలో సూర్యుడు, రాహువు కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈ యోగం వల్ల పలు రాశులవారి జీవితాల్లో భారీ మార్పులు జరిగే ఛాన్స్‌లున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సూర్యుడు, రాహువు కలయికల వల్ల ఏయే రాశులవారి జీవితాల్లో ఎలాంటి మార్పలు జరిగే ఛాన్స్ ఉందో, చెడు ప్రభావం ఉన్నవారు ఎలాంటి చర్యలు పాటించడం వల్ల ఉపశమనం లభించనుందో ఇప్పుడు చూద్దాం..
ఈ రాశులవారిపై ఎఫెక్ట్:
1. మేష రాశి:
ఈ రాశుల కలయికల వల్ల గ్రహణ యోగం మేషరాశిలోని లగ్నంలో ఏర్పడబోతోంది. కాబట్టి మేష రాశివారికి అహంకారం విశ్వాసంగా మారుతుంది. ప్రభుత్వం, రాజకీయ రంగాల్లో పనులు చేసేవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి కొంత కాలం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
2. వృషభ రాశి:
వృషభ రాశిలో పన్నెండవ స్థానంలో గ్రహణ యోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈ క్రమంలో వృషభ రాశివారికి మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
3. మిథునరాశి:
సూర్యుడు, రాహువు కలయిక వల్ల మిథునరాశిలో పదకొండవ స్థానంలో ఇది జరగబోతోంది. కాబట్టి సంచారం కారణంగా ఈ రాశివారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పనులలో కూడా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
Also Read: EX CM Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. ఏ బాధ్యతలు అప్పగించినా రెడీ
4. కర్కాటక రాశి:
కర్కాటక రాశిలో ఈ గ్రహణ యోగం దశమ గృహంలో అంటే కార్యస్థానంలో ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఉద్యోగం కారణంగా ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. ఆయతే ప్రయాణ సమయంలో ఆరోగ్యం పట్ట పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా సంచార క్రమంలో చేసే పనులపై ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
5. సింహ రాశి:
సింహరాశిలో తొమ్మిదో స్థానంలో ఈ సంచారం జరగబోతోంది. కాబట్టి మీరు ధార్మిక యాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తండ్రితో కూడా మనస్పర్థలు రావచ్చు. కాబట్టి ఈ క్రమంలో పెద్దలకు గౌరవం ఇవ్వడం చాలా మంచిది.
6. కన్య రాశి:
కన్యా రాశికి ఈ సంచారం ఎనిమిదవ స్థానంలో జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశివారికి చాలా రకాల దుష్ప్రభావాలు రావొచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శరీంలో నొప్పులు ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
Also Read: EX CM Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. ఏ బాధ్యతలు అప్పగించినా రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook