Sun Transit In Dhanu Rashi 2023: విశ్వానికి వెలుగును ప్రసాదించే దేవుడు సూర్యుడు. జ్యోతిష్యశాస్త్రంలో ఇతడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. భాస్కరుడు ప్రతి నెలా తన రాశిని మార్చుతూ.. సంవత్సరం మెుత్తం మీద 12 రాశులలో సంచరిస్తాడు. సూర్యుడు రాశిచక్రాన్ని మార్చడాన్నే సంక్రాంతి అంటారు. ఈ నెల 16న ఆదిత్యుడు ధనస్సు రాశిలోకి వెళ్లబోతున్నాడు. దీనినే ధను సంక్రాంతి అంటారు. సూర్యుడి రాశి వల్ల నాలుగు రాశులవారి దశ తిరగనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనస్సు రాశి
ఇదే రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కుటుంబంతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. 
సింహ రాశి
భాస్కరుడు సంచారం సింహరాశి వారికి మేలు చేస్తుంది. మీరు లీడర్ షిప్ క్వాలిటీస్ తో అందరినీ ఆకట్టుుంటారు. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
కుంభ రాశి
ఆదిత్యుడు సంచారం కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. మీరు లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. 


Also Read: Budhaditya Rajyog 2023: డిసెంబర్ 16 అరుదైన యోగం.. ఈ 3 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..


తులారాశి
సూర్యుడి రాశి మార్పు తులరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. 


Also Read: Budh Uday 2023: డిసెంబరు 27న ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి