Deepavali 2022 Solar Eclipse : ఈ ఏడాది రాబోతోన్న దీపావళికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు రోజుల దీపావళి పండుగలో, సూర్యగ్రహణానికి సంబంధించిన నీడ ఉంది. సూర్యగ్రహణం వల్ల ఇప్పుడు రకరకాల ప్రతికూల ప్రభావాలు ఏర్పడనున్నాయి. అయితే వాటిని తప్పించుకునేందుకు కూడా అవకాశం ఉంది. కొన్ని చర్యలతో వాటిని తొలగించుకోవచ్చు. అసలు అవేంటో ఓ సారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీపావళి నాడు సూర్య గ్రహణం రావడం చాలా అరుదు. ప్రస్తుతం ఇప్పుడు అలాంటి స్థితే వచ్చింది. 27 ఏళ్ల తర్వాత ఈసారి దీపావళి నాడు సూర్యగ్రహణం ఛాయలు కనిపిస్తున్నాయి. దీపావళి రోజు రాత్రి పూట చేసే లక్ష్మీ పూజ తర్వాత ఈ సూర్య గ్రహణ ప్రభావం కనిపించబోతోంది. ఇది 12 గంటలలో ఉంటుందని తెలుస్తోంది.


మళ్లీ మరుసటి రోజు అంటే.. అక్టోబర్ 25న సాయంత్రం 4:22 నుండి 6.30 గంటల వరకు వేర్వేరు ప్రాంతాల్లో సూర్య గ్రహణం సంభవించనుంది. రాశిచక్రం ప్రకారం.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కనిపించే ఈ సూర్యగ్రహణం వివిధ ప్రభావాలను చూపించబోతోంది. ఆ ప్రతికూల ప్రభావాలను మత విశ్వాసాలు, జ్యోతిషశాస్త్ర చర్యల ద్వారా తగ్గించవచ్చని తెలుస్తోంది.


సూర్యగ్రహణం సమయంలో వీటిని పాటించండి..
జ్యోతిష్కుడు పండిట్ రాజ్‌కుమార్ చతుర్వేది ప్రకారం.. ఎటువంటి శుభకార్యమైనా సరే వాటిని వాయిదా వేసుకోవాలి. సూతకంలో కూడా చేయడానికి వీల్లేదు. గ్రహణం సమయంలో తీసుకునే ఆహారం సురక్షితంగా ఉండాలంటే అందులో తులసి ఆకులను వేయాల్సి ఉంటుంది. గ్రహణం ముగిసే వరకు దేవుడి పూజలోనే ఉండాలి.


చాలీసా, మంత్రాలను జపిస్తూ పూజలు చేయాలి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇళ్లు అంతటినీ శుభ్రం చేసుకోవాలి. వీలైతే, ఉప్పు నీటితో  మొత్తం కడగాలి. దీని తరువాత స్నానం చేయాలి. ఆహార పదార్థాలపై గంగాజలాన్ని చల్లి శుద్ధి చేయాల్సి ఉంటుంది. గ్రహ ప్రభావాలు అన్ని రకాల గ్రహణాలకు వర్తిస్తాయి.


సూర్యగ్రహణం సమయంలో కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. పండిట్ చతుర్వేది ప్రకారం.. గ్రహణం సమయంలో భార్యాభర్తలు శారీరకంగా సంబంధం కలిగి ఉండకూడదు. అంతే కాకుండా దీపాలతో నూనె మర్దన, ధూపం, హారతి లేదా హవనము వంటివి చేయకూడదు. గర్భిణులు, జాతక దోషాలు ఉన్నవారు కూడా ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదని శాస్త్రం చెబుతోంది.


(డిస్ క్లెయిమర్ : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read : Rishab Shetty- Jr NTR: కాంతార హీరో ‘రిషబ్ శెట్టి’కి ఎన్టీఆర్ కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?


Also Read : Rakul Preet : రకుల్ కవ్వించే పోజులు.. ఒంపుసొంపులు చూపిస్తోన్న బ్యూటీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook