Surya Grahan 2022 Upay:  అతి పెద్ద సూర్యగ్రహం 2022 సంవత్సరంలో అక్టోబర్ 25 కార్తీక అమావాస్య రోజున రాబోతుంది. దీపావళి పండుగ కార్తీక అమావాస్య రోజున కావడంతో చాలా మందికి పండగపై స్పష్టత రాలేదు. అంతేకాకుండా 27 ఏళ్ల తర్వాత దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడడం విశేషం. ఈ సూర్యగ్రహం ప్రభావం కొన్ని రాశులవారిపై పడబోతోందని జోతిష్య శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా చాలా మందికి సూర్యగ్రహం వల్ల వచ్చే చెడు ప్రభావం ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది. అయితే వీరు ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటిండం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చెడు ప్రభావం బారిన పడకుండా పలు రకాల జాగ్రత్తలు కూడా పాటించడం చాలా మంచిదని జోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్తీక మాస అమావాస్య తేదీ అక్టోబర్ 24 సాయంత్రం 05.27 నుంచి ఆ తర్వాత రోజు అక్టోబర్ 25 సాయంత్రం 04.18 వరకు ఉంటుంది. అయితే సూర్యగ్రహణం 24 అర్ధరాత్రి నుంచి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది.


సూర్యగ్రహణం కాలం:
ఈ సంవత్సరంలో ఇది రెండో, చివరి సూర్యగ్రహణం కావడంతో ఇది పాక్షికంగానే ఉంటుంది. అయితే సూర్యగ్రహణం సమయం విషయానికొస్తే  అక్టోబర్ 24న దీపావళి రాత్రి 02:30కి ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు అక్టోబర్ 25న సాయంత్రం 04:22 గంటల దాకా ఇది కొనసాగుతూ ఉంటుంది.


27 ఏళ్ల తర్వాత ఇలా రావడం చాలా విశేషం:
27 ఏళ్ల క్రితం 1995లో దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. అయితే పూర్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం అక్టోబర్ మాసంలో రావడం చాలా ప్రధాన్యత సంతరించుకుంటుందని చెప్పొచ్చు. ఈ సారి ఏర్పడ బోతున్న సూర్య గ్రహణం  మొత్తం వ్యవధి 4 గంటల 3 నిమిషాలు.


ఎలాంటి పనులు చేయాలి:
సూర్యగ్రహణాన్ని అశుభకరమైన సంఘటనగా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో పలు రకాల పనులు చేయకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>>గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు.
>>ఈ క్రమంలో పళ్లు శుభ్రం చేసుకోకూడదు అంతేకాకుండా దువ్వుకోవడం కూడా మంచిది కాదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  
>>ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే ఇంటి నుంచి బయటకు రాకూడదు.
>>సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి శుభ కార్యాలు జరగవు కాబట్టి ఈ సమయంలో పూజలు కూడా చేయవద్దు.
>>వంటగదిలో చేసిన ఆహార పదార్థాల్లో తులసి ఆకులను వేయండి.
>>ఈ క్రమంలో సూర్యభగవాణున్ని పూజించి, ఆయన మంత్రాన్ని పారయంణం చేయండి.
>>గ్రహణం ముగిసిన తర్వాత, ఇల్లు, దుకాణం శుభ్రం చేసుకోండి. అంతేకాకుండా మీరు నివసించే ప్రదేశాల్లో గంగాజలం చల్లండి.  
>>గ్రహణం తర్వాత స్నానం చేయడం చాలా మంచిది.  
>> ఈ సమయంలో ధూపం, దీపం వంటివి అస్సలు వాడొద్దు.
>>గర్భిణీ స్త్రీలు లేదా జాతక దోషాలు ఉన్నవారు ఇంటి నుంచి బయటకు రాకూడదు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


 


Read Also: Happy Birthday Sai Dharam Tej : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?


Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook