Surya Grahan 2023: చివరి సూర్యగ్రహణం రోజున చేయకూడని పనులు ఇవే..తప్పక గుర్తుంచుకోండి..
Surya Grahan 2023 Dos And Don`ts: అక్టోబర్ 14న ఏర్పడే సూర్యగ్రహణం సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది నియమాలు, సూచనలు అనుసరించడం వల్ల దుష్ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Surya Grahan 2023 Dos And Don'ts: ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14న సంభవించబోతోంది. ఈ ఏర్పడబోయే సూర్యగ్రహణం అంత ప్రభావవం లేకపోయిన తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఏర్పడబోయే చంద్రగ్రహణానికి సూతక కాలం కూడా చెల్లుబాటు కాదని, జ్యోతిష్య శాస్త్రంలో ఈ ఏర్పడబోయే గ్రహణానికి ఎలాంటి ప్రాముఖ్య ఉండదని నిపుణులు తెలుపుతున్నారు.
గ్రహణాలు సంభవించడం వల్ల ప్రత్యేక ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. కొన్ని రాశులవారికి ఈ సమయంలో మంచి జరిగితే..మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహం సంభవించే ముందు ఏర్పడే సూతకాల సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరగవని అందరికీ తెలిసిందే..
సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..
జ్యోతిష్య శాస్త్రంలో సూతక కాలన్ని చెడు సమయంగా పరిగణిస్తారు. సూర్య, చంద్రగ్రహణాలు రెండు ఏర్పడినప్పుడు ఈ సూతక కాలం ఏర్పడుతుంది. అయితే ఇది గ్రహణం ఏర్పడే దాని కంటే 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఈ సమయంలో ఏమి చేయకూడదో తెలుసా?:
ఇంట్లో ఉండే పూజా గదిలో పూజలు చేయడం మానుకోవాల్సి ఉంటుంది.
దీంతో పాటు గుడిలోని దేవతల ఫోటోలను ముట్టుకూడదు.
గర్భిణి స్త్రీలు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం చాలా మంచిది.
ఈ సమయంలో కత్తెరలు, కత్తులు ముట్టుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
ఆవులు, గేదెలు, మేకలను దొంగతనం చేయకూడదు.
జుట్టు, బట్టలను శుభ్రం చేయడం మానుకోవాల్సి ఉంటుంది.
ఆహారాన్ని అస్సలు తినకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు.
ఇవి చేయోచ్చు:
గ్రహణ సమయంలో ఇళ్లలో అగరబత్తీలు, దీపాలు వెలించవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి కూడా దూరమవుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో తులసి ఆకులను ఆహార పదార్థాలపై ఉంచాల్సి ఉంటుంది. ధ్యానం చేయడం కారణంగా ఈ గ్రహణం నుంచి వచ్చే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఉన్నవారు పేదలకు ఆహారాలను దానం చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం