Surya Grahan Effect on these Zodiac Signs in Telugu: ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు చోటు చేసుకోబోతున్నాయి. రెండుసార్లు సూర్యగ్రహణం ఏర్పడనుండగా మరో రెండు సార్లు చంద్రగ్రహణం ఏర్పడునుంది. మరీ ముఖ్యంగా మరో వారం రోజుల్లో అంటే ఏప్రిల్ 20వ తేదీన ఈ ఏడాది మొత్తానికి మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ సూర్యగ్రహణం ఏర్పడే రోజు వైశాఖమాసానికి సంబంధించిన అమావాస్య కూడా కావడంతో ఆ రోజు రెండు అశుభ యోగాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ అశుభయోగాల వల్ల కొందరికి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయని అంచనాలు వేస్తున్నారు. అయితే ఏ రాశి వారికి ఈ అశుభయోగాల వల్ల ఎక్కువ కష్టాలు పెరుగుతాయి అనే విషయం మీద ఒకసారి పరిశీలన చేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సూర్యగ్రహణం సంభవిస్తున్న సమయంలో సూర్యుడు రాహు, బుధ గ్రహాలతో పాటు మేషరాశిలో ఉంటాడు. అదే సమయంలో కుజుడు బుధ రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు మేష రాశికి అధిపతిగా బుధుడు మిధున రాశి అధిపతిగా పరిగణిస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక మిధున రాశిలో కుజుడు మేషరాశిలోకి బుధుడు రావడం వల్ల రాశి మార్పు సంభవిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఏర్పడవచ్చు అని అంటున్నారు.


ఇదీ చదవండి: Shukra Gochar 2023: ఈ గ్రహ సంచారంతో మాళవ్య రాజయోగం, వీరు ముట్టింది బంగారం అవ్వక తప్పదు!


మేష రాశి
జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ సూర్యగ్రహణం మేష రాశి వారికి అశుభ్రంగా పరిగణించబడుతోంది. ఈ మేషరాశికి చెందిన వ్యక్తుల ఆరోగ్యం క్షీణించవచ్చని అదేవిధంగా వారి మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఇక ఈ గ్రహణం వల్ల చేసే పనుల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కూడా పని ఒత్తిడి ఎదుర్కొంటూ పై అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అలాగే వ్యాపారం విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పుగా ఈ సమయంలో నిరూపించబడే అవకాశం ఉందని అయితే ఉద్యోగం మానేయాలని చూస్తున్న వారికి ఆ ఉద్యోగం నుంచి విముక్తి కూడా లభించదని చెబుతున్నారు.


వృషభ రాశి
ఇక ఈ సూర్యగ్రహణం వృషభ రాశి వారికి కూడా ఇబ్బందికరంగా గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారి కుటుంబ వృత్తికి సంబంధించిన కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రాశి వారి స్వభావంలో కూడా స్పష్టమైన మార్పు ఈ సూర్యగ్రహణం వల్ల కనిపిస్తుందని ఆ సమయంలో కోపం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.  అనుకోని పరిస్థితుల్లో చిక్కుల్లో పడతారని ఆర్థిక పరిస్థితి కూడా కాస్త క్షీణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు.


కన్యా రాశి
మరోపక్క కన్యా రాశి వారికి కూడా ఈ అశుభ యోగం కారణంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ అశుభ యోగం కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారుతుందని ఇప్పటికే శరీరంలో తిష్ట వేసుకున్న ఒక పాత వ్యాధి మళ్ళీ బయటపడవచ్చునే అంచనాలు వెలువడుతున్నాయి. అలాగే ఫ్యామిలీలో ఏదో ఒక విషయంలో ఈ రాశి వారికి టెన్షన్ పెరుగుతుందని అలా పెరిగిన నేపథ్యంలో ఆ టెన్షన్ తీసుకువెళ్లి ఉద్యోగంలో లేదా వ్యాపారంలో చూపించడంతో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఆఫీసులో పనిచేసేందుకు కూడా ఆసక్తి చూపించని నేపథ్యంలో పై అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 


ఇదీ చదవండి: Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ ఎప్పుడు, ఆ రోజున ఈ పొరపాట్లు చేస్తే అంతే సంగతులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook