Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ ఎప్పుడు, ఆ రోజున ఈ పొరపాట్లు చేస్తే అంతే సంగతులు

Akshaya Tritiya 2023: హిందూవులకు అక్షయ తృతీయ అత్యంత శుభదినం. చాలా పవిత్రమైందిగా భావిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు అక్షయ తృతీయ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఏ మాత్రం పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి కటాక్షం కాకుండా ఆగ్రహానికి గురి కావచ్చు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2023, 11:18 AM IST
Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ ఎప్పుడు, ఆ రోజున ఈ పొరపాట్లు చేస్తే అంతే సంగతులు

Akshaya Tritiya 2023: హిందూ పంచాంగంలోని వైశాఖ శుక్లమాసం తృతీయ తిధినే అక్షయ తృతీయ అంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తే లాభం కలుగుతుందని విశ్వాసం. అందుకే ఈ రోజున మార్కెట్ కళకళలాడుతుంటుంది.

అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు అత్యంత అనువైన సమయంటారు. అదే సమయంలో ఏ చిన్న పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదముంది. ఫలితంగా జీవితాంతం పేదరికంలో మగ్గిపోవల్సి వస్తుందంటున్నారు జ్యోతిష్య పండితులు. అక్షయ తృతీయ రోజున చేసిన కర్మల్ని బట్టి ప్రతిఫలం లభిస్తుందంటారు. అందుకే ఈ రోజున సుఖ సంతోషాలు, వైభవం పొందేందుకు వివిధ రకాల ఉపాయాలు ఆచరిస్తుంటారు. ఈ ఉపాయాలు ఆచరించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు లభించాలని ఆశిస్తారు. అందుకే ఏ మాత్రం పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని జ్యోతిష్యులు సూచిస్తుంటారు. ఈ ఏడాది అంటే 2023లో ఏప్రిల్ 22వ తేదీన అక్షయ తృతీయ ఉంది.

అక్షయ తృతియ నాడు చేయకూడని పనులు

అక్షయ తృతీయ అనేది అత్యంత శుభదినం. ఈ రోజున బంగారం, వెండి వంటి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం మంచిదంటారు. ఈరోజున ప్లాస్టిక్, అల్యూమినియం, కంచు, స్టీల్ సామాన్లు అస్సలు కొనుగోలు చేయకూడదు. ఈ వస్తువులపై రాహువు ప్రభావం ఉన్నందున ఇంట్లో నెగెటివిటీ పెరుగుతుంది. ఆర్ధిక నష్టం వాటిల్లుతుంది. 

అక్షయ తృతీయ రోజున మాంసాహారం, వెల్లుల్లి-ఉల్లి తినకూడదు. ఈరోజున మత్తు పదార్ధాలు సేవించకూడదు. లేకపోతే జీవితాంతం పాపం కలుగుతుందని అంటారు. ఈ రోజున పూజ సందర్భంగా లక్ష్మీదేవికి తులసి ఆకులు సమర్పించకూడదు.

అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ప్రత్యేకించి పూజా మందిరం, ట్రెజరీ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. దాంతోపాటు విధి విధానాలతో విష్ణు భగవానుడిని, లక్ష్మీదేవిని పూజించాలి. ఈ ప్రదేశాలు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి దూరమై..మీ ఇంటిని దివాళా తీయిస్తుంది.

Also read: Mercury Combust 2023: బుధుడి అస్తమయం, ఏప్రిల్ 23 నుంచి ఆ 4 రాశులకు తీవ్ర సమస్యలు

అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి ఆభరణాలు పోగొట్టుకోవడం మంచి పరిణామం కాదు. ఈ రోజున ధనహాని శుభశకునం కాదంటారు. అందుకే ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండాలి.

అక్షయ తృతీయ రోజున ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వవద్దు. ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు. ఇలా చేస్తే ఇంట్లోంచి లక్ష్మీదేవి దూరమౌతుంది.

అక్షయ తృతీయ రోజున ఎవరితోనూ అబద్ధం చెప్పవద్దు. దొంగతనం చేయకూడదు. ఎవర్నీ మోసం చేయవద్దు. ఈ రోజున లాటరీ, జూదం వంటివాటికి దూరంగా ఉండాలి. లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 

Also read: Malavya Rajayogam 2023: శుక్రుడి రాశి పరివర్తనం, ఈ 3 రాశులకు ప్రారంభమైన రాజయోగం, వద్దంటే వస్తున్న డబ్బు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News