Surya Grahan 2023 In India Date And Time: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2023 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. వాటిలో మొదటి గ్రహణం సూర్యగ్రహణం ఏప్రిల్‌ రెండవ వారంలో సంభవించబోతోంది. అయితే ఈ గ్రహణానికి ఇంకా 15 రోజుల పాటు సమయం ఉంది. అయితే సూర్య, చంద్ర గ్రణాలు ఏర్పడినప్పుడల్లా ప్రతి రాశి చక్రంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రాశువారికి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశువారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలో సూర్యగ్రహణం తేదీ, సమయం:
2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 20 ఏప్రిల్ 2023 ఉదయం జరుగుతుంది. సూర్యగ్రహణం ఉదయం 7.4 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.29 వరకు జరగనుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయిన.. ప్రభావం మాత్రం పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


సూతక్ కాలం, సూర్యగ్రహణం ప్రభావం:
భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించకపోవడం వల్ల ఎలావటి సూతక కాలం ఉండే అవకాశాలు లేవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంవత్సరంలో జరిగే మొదటి సూర్య గ్రహంతో పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


మేషం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ సూర్యగ్రహణం మేషరాశిలో జరగబోతోంది. కాబట్టి ఈ క్రమంలో మేషరాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీటితో పాటు సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది. ఈ గ్రహణం కారణంగా  కెరీర్‌లో సమస్యలు కూడా రావొచ్చు. అయితే ఈ క్రమంలో ఎంత ఓపికగా అంత మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


కన్య:
సూర్యగ్రహణం కారణంగా కన్యారాశి వారికి కూడా చిన్న చిన్న సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రహణం క్రమంలో ఇతరులతో వివాదాలు పెట్టుకుని ఛాన్స్‌ ఉంది. కాబట్టి పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.


సింహ రాశి:
సింహ రాశికి సూర్యుడు అధిపతి.. సూర్యగ్రహణం కూడా ఈ రాశి వారిపై చాలా ప్రభావం చూపుతుంది. దీని కారణంగా ఈ రాశివారు తప్పకుండా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతారు. కాబట్టి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


మకర రాశి:
సూర్యగ్రహణం మకర రాశి వారిపై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ రాశివారికి లాభాలు తగ్గి ఖర్చులు పెరిగొచ్చు. అంతేకాకుండా వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం 


Also Read: Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌కు ముందు మార్పు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook