Solar Eclipse 2023 Date and Time in India: జ్యోతిష్యం మరియు ఖగోళ శాస్త్రంలో సూర్యగ్రహణం గురించి వివరంగా చెప్పబడింది. భూమి, సూర్యుడు మరియు చంద్రుడు ఒకే కక్షలోకి వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుని ప్రభావం మొత్తం 12 రాశులపై సానుకూలంగా మరియు ప్రతికూలంగా ఉంటుందని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడింది. ఈ సంవత్సరం మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో, భారతదేశంపై ఆ ప్రభావం ఉంటుందా ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యుల ప్రకారం.. ఈ సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 07.04 నుంచి మధ్యాహ్నం 12.09 వరకు సూర్య గ్రహణ సమయం ఉంటుంది. ఈ సూర్య గ్రహణం దక్షిణ మహాసముద్రం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మరియు ఫిలిప్పీన్స్ వంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. భారత దేశంపై ఈ సూర్య గ్రహణ ప్రభావం ఉండదు. దాంతో భారతదేశంలో సూతక్ కాలం కూడా ఉండదు. సూతక్ కాలం గ్రహణానికి 9-10 గంటల ముందు ప్రారంభమై గ్రహణం ముగిసిన తర్వాత ముగుస్తుంది.


భారతదేశంలో సూతక్ కాలం ఉండదు కాబట్టి.. సూర్య గ్రహణం అన్ని రాశులపై ప్రభావం చూపదని అనుకుంటే పొరపాటే. సూర్య గ్రహణ కాలంలో కొన్ని రాశుల వారు లాభాన్ని, కొన్ని రాశులకు నష్టాన్ని ఎదుర్కోవచ్చు. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం... 2023లో ఏర్పడే మొదటి సూర్య గ్రహణం వృషభం, జెమిని మరియు ధనుస్సు రాశిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ కాలంలో ఈ రాశిచక్ర వ్యక్తులు ద్రవ్య ప్రయోజనాలు, పదోన్నతి మరియు ఉద్యోగంలో విజయాన్ని పొందవచ్చు.


మరోవైపు సింహం, మేషం మరియు కన్యా రాశి వంటి కొన్ని రాశుల వారు సూర్య గ్రహణం సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో ఈ రాశుల వారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. పీడ కలలు, పని ప్రదేశాల్లో సమస్యలు, కుటుంబంలో వివాదాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. 


Also Read: Shardul Thakur Wedding: మిథాలీని పెళ్లి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఫొటోలు, వీడియోస్ వైరల్!  


Also Read: NZ Vs ENG: కళ్లు చెదిరే రనౌట్ చేసిన వికెట్ కీపర్.. వీడియో చూశారా..?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.