Solar Eclipse 2023 Bad Effects on Virgo, Aries and Libra Zodiac Signs: ఈ ఏడాదిలో రెండు సూర్య గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతకాలం ఉండదు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం... గ్రహణం సమయంలో మన చుట్టూ ఉన్న ప్రతిదీ ప్రభావితమవుతుంది. ఈ క్రమంలోనే మొత్తం 12 రాశులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నెలలో ఏర్పడే సూర్య గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై శుభప్రదంగా , మరోకొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు ప్రతికూల ప్రభావం చూపే రాశుల గురించి తెలుస్కుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్యా:
2023 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం కన్యా రాశి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సూర్య గ్రహణం మీకు మానసిక ఒత్తిడి, బాధను కూడా కలిగిస్తుంది. ఈ సమయంలో కాస్త ఆలోచించి మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. లేదంటే పరిస్థితి చేజారిపోతుంది. 


మేషం: 
ఈ సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం మేష రాశి వారికి అశుభం. ఈ రాశి వారు ప్రతికూల ప్రభావాలను చూస్తారు. ఈ సమయంలో, మీ వైవాహిక జీవితంలో కలతలు ఉండవచ్చు. జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.


తులా రాశి: 
సూర్య గ్రహణం 2023 ప్రతికూల ప్రభావం తులా రాశి వారిపై కనిపిస్తుంది. ఈ సమయంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. చాలా వరకు డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి. భవిష్యత్తులో ఇది అవసరం కావచ్చు. కుటుంబంలో వివాదాలను నివారించండి. తులా రాశి వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 


Also Read: Vodafone Idea Recharge Plans 2023: వోడాఫోన్ ఐడియా సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్‌, జియోలకు ఇక చుక్కలే!  


Also Read: Mangal Budh Gochar 2023: కుజ-బుధ గ్రహాల రాశి మార్పు యోగం.. ఈ రాశుల వారికి అపారమైన సంపద!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.