Vodafone Idea Rs 181 Recharge Plan gives 1 GB Daily Data with 30 Days: వోడాఫోన్ ఐడియా (వీఐ) ప్రస్తుతం భారతదేశ టెలికాం రంగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. 5G సేవలను కూడా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. 5G రోల్ అవుట్లో ఆలస్యం కారణంగా పోటీదారులైన జియో మరియు ఎయిర్‌టెల్‌తో పోటీ పడలేకపోతోంది. దాంతో టెలికాం మార్కెట్లో వీఐ ఎక్కువ వాటాను కలిగి లేదు. జియో, ఎయిర్టెల్ తమ 5G సేవలను ప్రారంభించి.. కొత్త ప్లాన్లను అందిస్తున్న నేపథ్యంలో వీఐ సబ్‌స్క్రైబర్ బేస్ క్షీణత కొనసాగుతోంది.
జియో, ఎయిర్టెల్ మాదిరిగానే వీఐ కూడా 5G సేవలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ప్రస్తుత కస్టమర్లకు అత్యుత్తమ ప్లాన్స్ అందించడానికి ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల డేటా, వాయిస్ మరియు మరిన్ని ప్రయోజనాలను అందించే రూ. 181 సరికొత్త ప్లాన్‌ను వీఐ ప్రారంభించింది. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వోడాఫోన్ ఐడియా తన మొబైల్ రీఛార్జ్ లిస్ట్‌కి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 181ను జోడించింది. ఇది డేటా వోచర్ ప్లాన్. వినియోగదారులు మరింత ఇంటర్నెట్ డేటాను పొందడానికి.. ఇప్పటికే ఉన్న యాక్టివ్ ప్లాన్‌తో కొనుగోలు చేయవచ్చు. ఆఫీస్ వర్క్ లేదా వినోదం (క్రికెట్, సినిమా, యూట్యూబ్) కోసం మొబైల్ డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం ఈ ప్లాన్‌ని వీఐ ప్రారంభించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు మరింత డేటాను పొంది ఇంటర్నెట్ సేవలను కొనసాగించవచ్చు.
Also Read: Mangal Budh Gochar 2023: కుజ-బుధ గ్రహాల రాశి మార్పు యోగం.. ఈ రాశుల వారికి అపారమైన సంపద!
వోడాఫోన్ ఐడియా ఇటీవల ప్రారంభించిన రూ. 181 డేటా వోచర్ ప్లాన్‌లో మొత్తం 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 1 GB డేటాను కస్టమర్ వినియోగించుకోవచ్చు. వినియోగదారు 1 GB డేటాను ఉపయోగించినప్పుడు.. అది మరుసటి రోజుకు మళ్లీ రీసెట్ చేయబడుతుంది. యాక్టివ్ ప్లాన్‌తో అందుబాటులో ఉన్న రోజువారీ డేటా వినియోగాన్ని పూర్తి చేసే వినియోగదారుల కోసం ఈ ప్లాన్ చాలా బాగుంటుంది. మీ రోజువారీ డేటాను ముగిసినట్లయితే.. రూ. 181 రీఛార్జ్ చేయడం ద్వారా మీరు మరిన్ని 4G డేటా ప్రయోజనాలను పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.