Surya Grahan 2024: జ్యోతిష్య శాస్త్రంలో రెండు గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఈ గ్రహణాలు ఏర్పడడం అశుభంగా  భావిస్తారు. అయితే ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం చైత్ర నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు ఏర్పడబోతోంది. అంతేకాకుండా ఇదే సమయంలో మీన రాశిలో శుక్రుడు, రాహువు, సూర్యుడు సంయోగ స్థితిలో ఉంటాయి. అతి త్వరలోనే కుజుడు మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఇదే సమయంలోనే సూర్యగ్రహణం జరగడం కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయి. అంతేకాకుండా ఏప్రిల్ 8వ తేది నుంచి బాధాకరమైన సంఘటనలు ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు:
మేషరాశి:

ఈ మొదటి సూర్యగ్రహణం కారణంగా మేషరాశివారి జీవితంలో తీవ్ర హెచ్చు తగ్గులుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరు కెరీర్‌ సంబంధింత సమస్యలు తీవ్రంగా ఎదుర్కోనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే తీసుకునే నిర్ణయాలు కూడా చాలా తప్పుగా ఉండే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ట్రేడింగ్‌ చేసేవారు ఈ సమయంలో మానుకోవడం చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. 


కన్యారాశి:
కన్యారాశి రాశివారికి ఏర్పడబోయే సూర్యగ్రహణం చాలా హానికరంగా ఉంటుంది. ఈ సమయలో వీరికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరికి ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక ప్రభావం పడొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో తీవ్రంగా నష్టపోతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పూర్తిగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ సమయంలో ఏవైన వస్తువులను కొనుగోలు చేయాడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు. ఇల్లు లేదా కారు కొనుగోలు చేయడం అస్సలు మంచిది కాదు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


వృశ్చికరాశి:
ఈ సమయంలో వృశ్చికరాశి రాశి వారు కూడా తీవ్రంగా నష్టపోయే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ప్రేమ జీవితంలో పెద్ద మార్పులు రావచ్చు. అంతేకాకుండా  కుటుంబ సభ్యులు మీపై గొడవలు పెట్టే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు వీరికి కోపం పెరిగి అనేక సమస్యల బారిన పడే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండడం చాలా మేలు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి