Surya Grahan 2024: ఈ రాశుల వారికి మొదటి సూర్యగ్రహణంతో సంవత్సరం మొత్తం అదృష్టమే..అదృష్టం!
First Surya Grahan 2024: 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది దీనికి కారణంగా రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో కొత్త కొత్త మార్పులు వస్తాయి. అయితే ఈ గ్రహణం కారణంగా ఏ ఏ రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయే తెలుసుకుందాం.
First Surya Grahan 2024: 2024వ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన ఏర్పడబోతోంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా కొంతైనా ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సూర్యగ్రహణం ఏర్పడడం కారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన యాదృచ్ఛికాలు ఏర్పడతాయి. ఇవి అన్ని రాశి చక్రాలపై శుభ ఆ శుభ ప్రభావాలను చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సూర్యగ్రహణం కారణంగా ఏర్పడే ప్రభావం మొత్తం అన్ని రాశుల వారిపై సమానంగా పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. జాతకాల్లో సూర్యుడు శుభ స్థానంలో ఉన్నవారికి ఈ గ్రహణం సమయంలో ఆర్థికంగా అదృష్ట పరంగా ఊహించని లాభాలు పొందుతారు. అయితే ఈ సంవత్సరం ఏర్పడే మొదటి సూర్యగ్రహణం కారణంగా ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మొదటి సూర్యగ్రహణం కారణంగా మేష రాశి వారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి బాస్ సపోర్టు లభించి మంచి గుర్తింపు పొందుతారు. ఈ సమయంలో కుటుంబం నుంచి కూడా మద్దతు లభిస్తుంది. అలాగే విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం చాలా కలిసి వస్తుంది. దీంతోపాటు మానసిక ప్రశాంతత పెరిగి ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ సమయంలో వివిధ ప్రదేశాలను సందర్శిస్తారు.
మిధున రాశి:
2024 లోని మొదటి సూర్యగ్రహణం కారణంగా మిధున రాశి వారికి కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారాలు చేస్తున్నవారు స్నేహితులతో కలిసి వాటిని మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్తారు. దీంతోపాటు మాటల్లో మాధుర్యం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సపోర్టు లభించి ఎలాంటి పనుల్లోనైనా ఊహించని విజయాలు సాధిస్తారు.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ గ్రహణం సందర్భంగా తల్లి మద్దతు లభిస్తుంది. దీనికి కారణంగా ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి అధికారుల నుంచి మద్దతు లభించి గొప్ప ప్రశంసలు పొందుతారు. దీంతోపాటు ఆర్థికంగా కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం ప్రమోషన్స్ పొందడానికి గోల్డెన్ ఛాన్స్.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారి వాటిని విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు లభించి, విహారయాత్రలకు కూడా వెళ్లగలుగుతారు. అలాగే ఆదాయం పెరగడం కారణంగా కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. దీంతోపాటు కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఆ తర్వాత శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో బట్టలు షాపింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కొన్ని మిశ్రమ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరు గ్రహణం సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండడం ఎంతో మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరికి రక్త సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అధికారులతో పాటు తోటి ఉద్యోగస్తులతో విభేదాలు రావచ్చు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter