Surya Grahan and Chandra Grahan in 2023: ఈ ఏడాది ముగియడానికి.. కొత్త సంవత్సరం 2023 ప్రారంభం కావడానికి కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. కొత్త ఏడాడిలో కొత్తగా ఏమి ఉండబోతుందో తెలుసుకోవాలని ప్రజలు ఇప్పటినుంచే వెతకటం మొదలుపెట్టారు. ఏ పండుగ ఎప్పుడు వస్తుంది..? కొత్త సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు వస్తాయి..? భారతదేశంలో ఎన్ని గ్రహణాలు కనిపిస్తాయో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. జ్యోతిషశాస్త్ర లెక్కల ఆధారంగా.. 2023 సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు, ఎప్పుడు ఏర్పడతాయో తెలుసుకుందాం. రాబోయే సంవత్సరంలో 4 గ్రహణాలు వస్తాయి. ఇందులో 2 చంద్రగ్రహణం, 2 సూర్యగ్రహణం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి గ్రహణం


2023లో ఏప్రిల్‌లో తొలి గ్రహణం ఏర్పడనుంది. మొదటి సూర్యగ్రహణం గురువారం 20 ఏప్రిల్ 2023న ఏర్పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 20 ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.29 వరకు కొనసాగుతుంది. జ్యోతిష్యం ప్రకారం భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు. ఈ సూర్యగ్రహణం సూతక్ కాలం చెల్లదు.  


రెండవ గ్రహణం 


రెండవ గ్రహణం ఏప్రిల్ 20 తర్వాత సరిగ్గా 15 రోజుల తర్వాత.. మే 5, 2023 శుక్రవారం నాడు ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో ఇదే తొలి చంద్రగ్రహణం. రాత్రి 8.45 గంటలకు గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1 గంటలకు ముగుస్తుంది. చంద్రగ్రహణం సూతక్ కాలం 9 గంటల ముందు మొదలవుతుంది.


మూడవ గ్రహణం


2023 సంవత్సరంలో మూడవ సూర్యగ్రహణం అక్టోబర్ 14, 2023 శనివారం నాడు ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో ఇది రెండవ సూర్యగ్రహణం అవుతుంది. తొలి సూర్యగ్రహణం మాదిరిగానే ఈ గ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. ఇది పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటికా, ఆర్కిటిక్‌లలో కనిపిస్తుంది. 


నాల్గవ గ్రహణం 


చంద్రగ్రహణం 2023 సంవత్సరంలో చివరి గ్రహణం. అక్టోబర్ 29 ఆదివారం నాడు ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ఉదయం 1.06 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. దాని సుతక్ కాలం కూడా చెల్లుబాటు అవుతుంది. ఇది 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. 


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: కోహ్లీకి ఇష్టమైన ప్లేస్‌పై కన్నేసిన సూర్యకుమార్ యాదవ్.. కుమ్మేస్తున్నాడుగా..!


Also Read: Jabardasth Ram Prasad : జబర్దస్త్ రాం ప్రసాద్‌కు ఏమైంది?.. అలా ఎందుకు కనిపించాడు.. పిక్స్ వైరల్‌


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి