Surya Grahanam 2023: సాధారణంగా గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, సూర్యగ్రహణం అమావాస్య రోజున, చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న సంభవించనుంది. ఇది భారతదేశంలో కనిపించదు. గ్రహణం ఏప్రిల్ 20 ఉదయం 07.04 గంటలకు మెుదలయ్యి.. మధ్యాహ్నం 12:29 గంటలకు వరకు ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది జరిగిన పదిహేను రోజుల తర్వాత వైశాఖ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మరోవైపు ఏప్రిల్ 14న సూర్యుడు మీనరాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంవత్సరం మెుదటి సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడబోతుంది. ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


కన్య రాశి
గ్రహణం కారణంగా మీరు ఆఫీసులో సమస్యలను ఎదుర్కోంటారు. మీ బాస్ తో సంబంధాలు చెడిపోతాయి. వ్యాపారులు భారీగా నష్టపోతారు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. 


Also Read: మరో 4 రోజుల్లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీ రాశి ఉందా?


తుల రాశి 
సూర్యగ్రహణం యొక్కచెడు ప్రభావం తుల రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ధన నష్టం ఉంటుంది. ఈ సమయంలో ఎవరికి అప్పు ఇవ్వకండి. ఈ సమయంలో పెట్టుబడి అస్సలు పెట్టదు. డబ్బును ఆదా చేసుకోండి. కుటుంబంలో వివాదాలు వస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. 


మేషరాశి
ఏప్రిల్ 20న ఏర్పడబోయే సూర్యగ్రహణం మేషరాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. మీకు లైఫ్ పై క్లారిటీ రాదు. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి వస్తుంది. మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం చెడిపోతుంది. 


వృషభం
సూర్యగ్రహణం కారణంగా వృషభరాశి వారు ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ కెరీర్లో అడ్డంకులు వస్తాయి. మీరు అనారోగ్యానికి గురవుతారు. కుటుంబంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. 


Also Read: Surya Mahadasha effect: సూర్య మహాదశ ఎఫెక్ట్.. వచ్చే 6 ఏళ్లు మీకు డబ్బే డబ్బు...లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook