Sun Eclipse effect on Zodiac Signs 2023:  ఖగోళ శాస్త్రంలో సూర్య, చంద్ర గ్రహణాలు చాలా ముఖ్యమైన సంఘటనలు. ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహణాలను అపశకునంగా భావిస్తారు.  కాబట్టి గ్రహణ కాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20, గురువారం నాడు ఏర్పడబోతుంది. ఇది ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నాం 12.29 గంటల వరకు ఉంటుంది. అయితే సూర్యగ్రహణం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. సూర్యగ్రహణం సమయంలో ఏరాశుల వారు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యగ్రహణం సమయంలో ఈ రాశుల వారు జాగ్రత్త
మేషం: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం మేషరాశిలోనే సంభవిస్తుంది. దీంతో ఈ గ్రహణం ఈ రాశివారికి బాగుంటుందని చెప్పలేం. కాబట్టి ఈ వ్యక్తులు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా అనేక సవాళ్లు ఎదుర్కోవల్సి ఉంటుంది. డబ్బులావాదేవీలు చేసేటప్పుడు జాగురుకతతో ఉండండి. ఈ సమయంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. 
కన్య: సూర్యగ్రహణం కన్యారాశి వారికి మంచిది కాదు. ఈరాశివారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పనుల్లో అపజయాన్ని ఎదుర్కోంటారు. ఈ సమయంలో మీ కోపం పెరిగే అవకాశం ఉంది. ఇతరులతో కూల్ గా మాట్లాడండి, లేకుంటే వివాదాలు తలెత్తువచ్చు.
సింహరాశి : ఏప్రిల్ 20న ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణం సింహరాశి వారికి మంచిది కాదు. వీరు ఏ పనిచేపట్టినా అది చెడిపోతుంది. విద్యార్థులు చదువులో వెనుకబడిపోతారు. కెరీర్ లో అడ్డంకులు ఎదురవుతాయి. మానసిక కుంగిపోయే అవకాశం ఉంది. 


Also read: Surya Gochar 2023: మార్చి 15 వరకు ఈరాశుల వారు జాగ్రత్త... ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook