Surya Gochar 2023: మార్చి 15న మీనంలో సూర్య-గురు సంయోగం.. ఈ రాశులకు అంతులేని అదృష్టం, ఐశ్వర్యం!
Sun Jupiter Conjunction 2023: మీనరాశిలో సూర్యుని సంచారం కారణంగా బృహస్పతి-సూర్య సంయోగాన్ని ఏర్పడుతుంది. వీరి కలయిక కొంతమందికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది.
Sun Jupiter Conjunction 2023: ప్రతి నెల సూర్యభగవానుడు తన రాశిని మారుస్తుంటాడు. గురు గ్రహం ఏడాదికి ఒక్కసారి తన రాశిని మారుస్తాడు. మార్చి 15న సూర్యభగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ప్రస్తుతం బృహస్పతి మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో గురుడు మరియు సూర్యుడు కలయిక ఏర్పడింది. వీరిద్దరి సంయోగం వల్ల సూర్య-గురు సంయోగం ఏర్పడుతుంది. సూర్యుడు ఏప్రిల్ 14, 2023 వరకు మీనరాశిలో ఉండి ఆ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడి సంచారం ఏ రాశులవారికి శుభఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.
సూర్యుడి సంచారం ఈ రాశులకు వరం
వృషభం: సూర్య సంచారం వృషభరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలను గడిస్తారు. మీరు కెరీర్ లో పెద్ద పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వృశ్చికం: సూర్యుని గోచారం వల్ల ఏర్పడిన సూర్య-గురు గ్రహ సంయోగం వృశ్చిక రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీరు వృత్తిలో పురోగతిని సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. విద్యార్థులు రాణిస్తారు.
కుంభం: సూర్య సంచారం కుంభరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. పెళ్లికాని వారికి వివాహం కుదురుతుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. పాత సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏ పని చేపట్టినా దానిని పూర్తిచేస్తారు.
మీనం: సూర్యుని రాశిలో మార్పు మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు ఆఫీసులో పాపులారిటీ పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు మీ పనిని మెచ్చుకుంటారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.
Also Read: Rahu-Ketu Gochar 2023: రాహు-కేతు గోచారం.. ఈ 4 రాశుల జీవితం కష్టాలమయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook