Surya Guru Yuti Effect 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒకే రాశిలో రెండు గ్రహాల లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయికను సంయోగం అంటారు. ఈ కలయిక కొన్ని రాశులవారికి శుభప్రదంగా, మరికొన్ని రాశులవారికి అశుభకరంగా ఉంటుంది. గత నెలలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించాడు. అదే నెల 22న బృహస్పతి కూడా మేషరాశి ప్రవేశం చేశాడు. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు మేషరాశిలో కలిసి ఉన్నాయి. దీని కారణంగా సూర్యుడి శక్తి పెరిగింది. ఆదిత్యుడు, గురుడు మైత్రి వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి
సూర్యుడు మరియు బృహస్పతి కలయిక మేషరాశి వారికి మేలు చేస్తుంది. మీరు లవ్ లో సక్సెస్ అవుతారు. మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. విద్యారంగంలో ఉన్నవారు బెనిఫిట్స్ పొందుతారు. 
సింహరాశి
సింహ రాశి వారికి సూర్యుడు మరియు బృహస్పతి కలయిక శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. జాబ్ చేంజ్ అవ్వాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. మీకు ధనలాభం ఉంటుంది. ఈరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి వీరు మంచి ప్రయోజనాలే పొందుతారు. 


Also read: Pluto Transit 2023: మకరరాశిలో ప్లూటో తిరోగమనం.. ఈ 6 రాశులపై డబ్బు వర్షం..


ధనుస్సు రాశి
సూర్యభగవానుడు మేషరాశిలో ఉంటే ధనస్సు రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఇదే సమయంలో గురుడు త్రికోణ రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. మీ కెరీర్ లోని సమస్యలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. 


Also Read: Surya Gochar 2023: సూర్యుడి గోచారంతో నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook