Surya Mahadasha effect: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. విజయం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యాన్ని ఇచ్చే గ్రహం సూర్యుడు.  జాతకంలో సూర్యుడు శుభప్రదంగా ఉంటే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సాధారణంగా సూర్యమహాదశ ఆరు సంవత్సరాలుపాటు ఉంటుంది. ఎవరి జాతకంలో సూర్యమహాదశ ఉంటుందో వారికి దేనికీ లోటు ఉండదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుని మహాదశ యొక్క ప్రభావం
జాతకంలో సూర్యుని స్థానం బాగుంటే మహాదశలో ఆ వ్యక్తికి పేరు ప్రఖ్యాతలతోపాటు కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. సూర్యమహాదశ కారణంగా మీరు గొప్ప నాయకుడు అవుతారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. పాలిటిక్స్ లో ఉన్నవారు పదవి దక్కుతుంది. 


మరోవైపు, సూర్యుని మహాదశ సమయంలో జాతకంలో సూర్యుడు అశుభ స్థానంలో ఉండటం వల్ల అనేక రకాల నష్టాలు కలుగుతాయి. కోపం పెరుగుతుంది. కుటుంబంలో కలహాలు వస్తాయి. మీరు అనారోగ్యం బారిన పడతారు. మీ జాతకంలో సూర్యుడు బలపడాలంటే ఈ కింది పరిహారాలు చేయండి. 


సూర్యుని మహాదశ నివారణలు
** ప్రతిరోజూ రాగి పాత్రతో నీరు తీసుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీరు ఆదిత్యుడి అనుగ్రహం పొందుతారు. రోలీ, అక్షతలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పిస్తే దీని ప్రయోజనం మరింత పెరుగుతుంది.
** సూర్యుని మహాదశ సమయంలో అశుభ ఫలితాలను నివారించడానికి 'ఓం రామ్ రవయే నమః' మరియు 'ఓం ఘృణి సూర్యాయ నమః' మంత్రాలను జపించండి.
** ప్రతి ఆదివారం గోధుమలు, బెల్లం లేదా రాగిని దానం చేయడం వల్ల జాతకంలో సూర్యుడు బలపడతాడు మరియు సూర్యుని మహాదశ సమయంలో దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.
** రోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగి పనిలో విజయం సాధిస్తారు.


Also Read; Guru Gochar 2023: 'గురు చండాల యోగం' చేస్తున్న బృహస్పతి-రాహువు.. ఈ 5 రాశుల జీవితం నరకం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook