Astrology: త్వరలో సింహరాశిలో అద్భుతమైన కలయిక.. ఈ రాశుల ఖజానా నిండటం పక్కా..!
Astrology: గ్రహాల సంచారపరంగా ఆగస్టు నెల చాలా ముఖ్యమైనది. వచ్చే నెలలో సింహరాశిలో సూర్యుడు మరియు కుజుడు కలయిక జరగబోతుంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Mangal Yuti 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. ఆగస్టు నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. వచ్చే నెలలో సింహరాశిలో సూర్యుడు-కుజుడు కలయిక జరగబోతుంది. ఇప్పటికే అంగారకుడు సింహరాశిలో ఉండగా.. ఆగస్టు 16న అదే రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. వీరిద్దరి కలయిక మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం: మేష రాశికి అధిపతి కుజుడు. సింహరాశిలో కుజుడు-సూర్యుడు కలయిక మేష రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ లవర్ లేదా లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు.
కర్కాటకం: సూర్యుడు మరియు కుజుడు కలయిక కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటి పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
Also Read: Mars-Jupiter Yuti: నవపంచమ రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం పట్టనుంది.. మీరున్నారా?
సింహరాశి: సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఇదే రాశిలో కుజుడు-సూర్యుడు సంయోగం జరగబోతుంది. దీంతో ఈ రాశివారు ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్-ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. బిజినెస్ లో భారీ డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు.
Also Read: Chandra Grahanam 2023: దసరా తర్వాత రెండో చంద్రగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook