Chandra Grahanam 2023: దసరా తర్వాత రెండో చంద్రగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే?

Chandra Grahanam 2023: ఈ సంవత్సరం ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం సంభవించాయి. రెండవ చంద్రగ్రహణం అక్టోబరు నెలలో ఏర్పడబోతుంది. ఈ గ్రహణం ఎంత సమయం ఉంటుంది, ఇండియాలో కనిపిస్తుందా, సూతక్ కాలం చెల్లుతుందా అనే విషయాలు తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2023, 04:07 PM IST
Chandra Grahanam 2023: దసరా తర్వాత రెండో చంద్రగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే?

Last Lunar Eclipse 2023 date:  సాధారణంగా గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. గ్రహణ సమయాల్లో ఏ పనులు చేసిన చెడు ఫలితాలనే ఇస్తాయని నమ్ముతారు. సూర్య, చంద్ర గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. ఈ ఏడాది నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ఇందులో రెండు సూర్య మరియు రెండు చంద్రగ్రహణాలు సంభవించనున్నాయి. ప్రస్తుతం శ్రావణ మాసం కొనసాగుతోంది. త్వరలో ఈ సంవత్సరం రెండవ మరియు చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. 

అక్టోబర్ 29న రెండో చంద్రగ్రహణం
ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం 29 అక్టోబర్ 2023న జరుగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, చంద్రగ్రహణం మధ్యాహ్నం 01.06 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 02.22 గంటలకు ముగుస్తుంది. ఇప్పడు ఏర్పడబోయేది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో కనిపిస్తుంది. అంతేకాకుండా సూతక్ కాలం కూడా చెల్లుతుంది. 
ఈ దేశాల్లో గ్రహణం కనిపిస్తుంది?
ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఉత్తర మరియు తూర్పు దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికాలో కనిపిస్తుంది.

Also Read: Sun Transit 2023: మరో 5 రోజుల తర్వాత ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. మీ రాశి ఉందా?

రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు?
మరోవైపు ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14న ఏర్పడనుంది. సూర్యగ్రహణం రాత్రి 8.34 నుంచి మధ్యాహ్నం 2.55 గంటల వరకు ఉంటుంది. రెండవ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతకం చెల్లదు. ఈ సూర్యగ్రహణం పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మరియు ఆర్కిటిక్‌లలో కనిపిస్తుంది.

Also read: Rajyog in July: జూలై 16న శుభకరమైన యోగం.. ఈ 6 రాశులవారికి గుడ్ టైమ్ స్టార్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News