Surya Transit 2024 Effect In Telugu: గ్రహ సంచారాల పరంగా సెప్టెంబర్ ఒకటో వారం ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ వారంలోని ఒకటో తేదీ రోజే సూర్య గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా వెంటనే జరిగిపోతాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య గ్రహం తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉంది. అలాగే శని పరిపాలించే కుంభ రాశిలోకి సంచారం దశగా అడుగులు వెయ్యబోతోంది. దీంతో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంసప్తక యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ యోగాన్ని అత్యంత ప్రాముఖ్యత కలిగిన యోగంగా పరిగణిస్తారు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ ప్రభావంతో ఆ రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో పూర్తిగా మార్పులు వస్తాయి. దీని కారణంగా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో.. అత్యధిక ప్రయోజనాలు పొంది రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి 
మేష రాశి వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి పాత స్నేహితులను కలిసి అవకాశాలున్నాయి. దీని కారణంగా వీరు ఎంతో సంతోషంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశి వారికి మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా అన్ని సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వీరి ఇంటికి త్వరలోనే అతిథులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా వీరు మంచి ఆహారాన్ని ఆస్వాదించడమే కాకుండా వారితో ఎంతో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. అలాగే కొత్త సాంకేతిక పరికరాలను కూడా కొనుగోలు చేస్తారు. అప్పుల బాధతో బాధపడుతున్న వారు ఈ సమయంలో తిరిగి చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి.  భాగస్వామి మధ్య ప్రేమ మరింత పెరిగి డబ్బు సంబంధిత వ్యవహారాల్లో సపోర్టు లభిస్తుంది. 


మకర రాశి 
ఈ ప్రత్యేకమైన యోగం కారణంగా మకర రాశి వారికి కొత్త ఆశలు కలుగుతాయి. అంతేకాకుండా మానసిక పరిస్థితి కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు వివాహాలు కాని వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా పనుల్లో ఆటంకాలు ఉన్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా మారి అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. రాజకీయ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అనుకున్న పదవులు లభిస్తాయి. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఊహించని లాభాలతో పాటు భాగస్వామితో ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే ఎలాంటి పనులు చేసినా వీరు ఎంతో కష్టపడతారు.. కాబట్టి విజయాలు కూడా పొందుతారు. 


ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి కూడా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.  ఒంటరిగా జీవితం గడుపుతున్న వ్యక్తులకు వివాహ ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో కష్టపడి పెట్టుబడులు పెడుతున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో మీ ప్రాధాన్యత కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతోపాటు ఈ సమయంలో మీ తండ్రి సపోర్టు లభించి అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.