Sun Transit Effect: ఈ నెలలో రాశిని మార్చబోతున్న సూర్యుడు.. 3 రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..!
Sun Transit 2022: ఈ నెలలో సూర్యుడి తన రాశిని మార్చనున్నాడు. దీని ప్రభావం 3 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Surya Transit In Cancer 2022: గ్రహాల రాజు సూర్యుడు తన రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. ఈనెల 16న మిథున రాశిని విడిచి కర్కాటక రాశిలోకి (Surya Transit In Cancer 2022) ప్రవేశిస్తాడు. అక్కడే ఆగష్టు 17 వరకు ఉంటాడు. సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. సూర్యుని సంచారం మెుత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కర్కాటక రాశిలో సూర్యుడి సంచారం 3 రాశులవారికి అదృష్టాన్ని తెస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం.
మేషం (Aries): కర్కాటక రాశిలో సూర్యుని సంచారం వల్ల మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారికి వృత్తిలో పురోగతి ఉంటుంది. పెద్ద పదవి వరించే అవకాశం ఉంది. ఉద్యోగులు నచ్చిన జాబ్ కు షిప్ట్ అవుతారు. ఈ సమయం వ్యాపారులకు అనుకూలం.
వృషభం (Taurus): సూర్యుని రాశి మార్పు వల్ల వృషభ రాశి వారికి కొత్త జాబ్స్ వస్తాయి. వీరు ఆఫీస్ లో ప్రశంసలు పొందుతారు. ప్రయణాలు చేయడానికి ఇది అనుకూల సమయం. వ్యాపారులకు కలిసి వస్తుంది.
మిథునం (Gemini): మిథున రాశి వారికి సూర్యుని మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.
Also Read: Lakshmi Devi Pooja: ఆ రోజుల్లో ఇలా పూజలు చేస్తే..ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook