Surya Gochar 2022: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజు అయిన సూర్యుడిని ధైర్యం, శక్తి, గౌరవం మరియు ఆత్మకు కారకుడిగా భావిస్తారు. అలాంటి సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం తులరాశిలో ఉన్న సూర్యదేవుడు.. నవంబరు 16న వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈరాశికి అధిపతి అంగారకుడు. సూర్యుడి రాశి మార్పు (Surya transit in Scorpio 2022) మొత్తం 12 రాశులపై పెను ప్రభావాన్ని చూపుతుంది. వృశ్చికరాశిలో సూర్యుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునరాశి (Gemini)- ఈ రాశి యెుక్క మూడవ ఇంటికి సూర్యుడు అధిపతి మరియు ఆరో ఇంట్లో సంచరించనున్నాడు. వృశ్చికరాశిలో సూర్యుడి సంచారం వల్ల మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విదేశీయానం కూడా చేయవచ్చు. వ్యాపారులు భారీగా లాభాలను సాధిస్తారు.  
కన్య (Virgo)- కన్యారాశి యెుక్క 12వ ఇంటికి సూర్యభగవానుడు అధిపతి మరియు మూడవ ఇంట్లో సంచరిస్తాడు. సూర్య సంచారం కారణంగా మీరు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మెుత్తానికి ఈ సమయం కలిసి వస్తుంది. 


వృశ్చిక రాశి (Scorpio)- ఈ రాశి యెుక్క దశమి స్థానానికి సూర్యుడు అధిపతి. అంతేకాకుండా మీ రాశిచక్రంలోని లగ్న గృహంలో సంచరిస్తాడు. సూర్యుని రాశి మార్పు వల్ల మీరు సమాజంలో  గౌరవాన్ని పొందుతారు. ధైర్యం, శక్తి కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.  
మకరం (Capricorn)- మకరరాశి యెుక్క ఎనిమిదవ ఇంటికి సూర్యుడు అధిపతిగా పరిగణించబడ్డాడు. నవంబర్ నెలలో సూర్యుడు మీ పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. సూర్య సంచారం వల్ల మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. మీ సోదరసోదరీమణుల సపోర్టు లభిస్తుంది. పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు.  


Also Read: Laxmi Narayan Yoga: లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులవారికి లాటరీ తగలడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook