Laxmi Narayan Yoga: లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులవారికి లాటరీ తగలడం ఖాయం..

Laxmi Narayan Raja Yoga: ఆస్ట్రాలజీ ప్రకారం, వృశ్చికరాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈయోగం మూడు  రాశులవారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2022, 11:13 AM IST
Laxmi Narayan Yoga: లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులవారికి లాటరీ తగలడం ఖాయం..

Laxmi Narayan Raja Yoga:  వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలక్రమేణా రాశిచక్రాన్ని మారుస్తాయి. దీని ద్వారా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ధనం, సంపదలకు కారకుడిగా భావించే శుక్రుడు నవంబర్ 11న వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆ తర్వాత మేధస్సుకు, వ్యాపారానికి కారకుడిగా భావించే బుధుడు నవంబర్ 13న వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల వృశ్చిక రాశిలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం అన్ని రాశులపైనా కనిపిస్తుంది. కానీ ఇది 3 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.  

మకర రాశి (Capricorn): ఈ రాశివారికి లక్ష్మీ నారాయణ యోగం చాలా మేలు చేస్తుంది. మకరరాశి యెుక్క 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్యం ప్రకారం, ఇది ఆదాయం మరియు సంపద యొక్క ప్రదేశంగా పరిగణిస్తారు. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. మీరు స్టాక్ మార్కెట్ మరియు బెట్టింగ్, లాటరీల ద్వారా మీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. మీరు వ్యాపారంలో భారీ మెుత్తంలో లాభాలను గడిస్తారు. దీంతో మీకు ఆర్థికంగా లాభిస్తుంది. అంతేకాకుండా మీ కోరిక నెరవేరుతుంది. 

కుంభ రాశి(Aquarius): లక్ష్మీ నారాయణ యోగం వల్ల ఈరాశివారు వృత్తి, వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే మీ సంచార జాతకం యెుక్క పదో ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీరు ఏదైనా ఇల్లు లేదా విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీకు ఆఫీసులో కొత్త బాధ్యతలు అప్పజెప్పబడతాయి. 

తుల రాశి (Libra): బుధ, శుక్రుల కలయిక తుల రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ టైం మీకు పూర్తిగా కలిసి వస్తుంది. 

Also Read: Shukra Rashi Parivartan 2022: శుక్ర గ్రహ సంచారం వల్ల నవంబర్ 11 నుంచి ఈ రాశువారు డబ్బు పొందడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News