Swapna Shastra: స్వప్న శాస్త్రంలో, వివిధ కలల గురించి చాలా ప్రస్తావనలు ఉన్నాయి. దీని ఆధారంగా వారి శుభ మరియు అశుభ సంకేతాల గురించి తెలుసుకోవచ్చు. నిద్రపోతున్నప్పుడు కలలు కనడం మానవులకు సర్వసాధారణం. కానీ కలలకు (dreams) కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ప్యూచర్లో జరగబోయే అనేక సంఘటనల గురించి కలలు మనల్ని హెచ్చరిస్తాయి. కలలో చనిపోయిన తమ పూర్వీకులను చాలా మంది చూసే ఉంటారు. అలాంటి కలల వస్తే... ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలలో చనిపోయిన పూర్వీకులు కనిపిస్తే..
** మీ కలలో చనిపోయిన పూర్వీకులను (Watching Ancestors in Your dream) చూస్తున్నట్లయితే.. మీరు వారిని మరచిపోయి పెద్ద తప్పు చేశారని అర్థం. ఈ కల ద్వారా వారు మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారని అర్థం. మీరు వారి సంకేతం అర్థం చేసుకున్నట్లయితే అమావాస్య రోజున నది ఒడ్డున అతని పేరు మీద దీపం వెలిగించి..ఒక పేదవ్యక్తికి జత బట్టలు దానం చేయండి. 
** కలలో మన పూర్వీకులు మన వైపు చేతులు చాచినట్లు కనిపిస్తే.. వారు మన జీవితంలో జరుగుతున్న సమస్యలతో బాధపడుతున్నారని మరియు వాటిని తగ్గించాలని కోరుకుంటున్నారని అర్థం.
**  పూర్వీకులు కలలో ఏదైనా అడుగుతున్నట్లు కనిపిస్తే, మీరు బ్రాహ్మణులకు లేదా పేదవారికి ఆహారం వండి తినిపించవచ్చు.


**  కలలో పూర్వీకులు తల దగ్గర నిలబడి కనిపిస్తే, మీ జీవితంలో కష్టాలు తగ్గుతాయని అర్థం. మీరు పాదాల దగ్గర నిలబడి కనిపిస్తే, మీ జీవితంలో కష్టాలు రాబోతున్నాయని అర్థం.
**  మీ పూర్వీకులు మీ తలపై నిమురుతూ కనిపిస్తే, వారు మీ పట్ల సంతృప్తి చెందారని మరియు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారని అర్థం.
**  మీ కలలో పూర్వీకులు తక్షణమే అదృశ్యమైనట్లు మీరు చూసినట్లయితే, మీ జీవితంలో ఏదైనా సమస్య రాబోతుందని అర్థం, మీరు సిద్ధంగా ఉండాలి. 
**  మీ కలలో మీ పూర్వీకులు కోపంగా ఉన్నట్లు కనిపిస్తే, ఈ కల పూర్వీకుల ఆస్తికి సంబంధించిన పెద్ద నష్టాన్ని చూపుతుంది.
**  మీ కలలో పూర్వీకులు మీతో కలిసి నడుస్తున్నట్లు కనిపిస్తే, వారి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం. మీ ప్రతిష్ట, పదవి, ప్రతిష్టలు పెరుగుతాయి.


Also Read: జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం చేయండి... ఆనందంతోపాటు అంతులేని సంపద మీ సొంతం.. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook