Teachers Day: శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే.. గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘'గు'’ అంటే చీకటి, ‘'రు'’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట.  ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి(Dr. Sarvepalli Radhakrishna jayanthi)ని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం(Teachers day)గా గుర్తించింది. అందుకే ప్రతిఏటా సెప్టెంబరు 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం.దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.


Also Read: Zodiac Signs: ఈ రాశులవారికి పెళ్లంటే ఇష్టముండదు.. అందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి!


ఆ కథ ఏంటంటే..


రాజకీయాల్లో రాకముందు ముందు, రాధాకృష్ణన్(Radhakrishna) చెన్నై ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా విశ్వవిద్యాలయంతో సహా వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతే కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా కుడా పనిచేశాడు. తూర్పు మతాలు, నీతి బోధించడానికి 1936 లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆయనకు ప్రతిపాదన వచ్చింది. రాధాకృష్ణన్ ఈ ప్రతిపాదనను అంగీకరించి అక్కడ చాలా సంవత్సరాలు బోధించారు. 


బోధనతో పాటు, అయన 1946 నుండి 1952 వరకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. సోవియట్ యూనియన్‌లో భారత రాయబారిగా కూడా నియమించబడ్డారు. ఆ తరవాత 1952లో అయన భారతదేశపు మొదటి ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. తరువత 1962 లో భారతదేశపు రెండవ రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, రాధాకృష్ణన్ ను విద్యార్థులు సంప్రదించి, అయన పుట్టినరోజును జరుపుకోవడానికి అనుమతించమని అభ్యర్థించారు. వారిని అలా అనుమతించకుండా, దానిని ఉపాధ్యాయ దినోత్సవం(Teachers day)గా పాటించాలని కోరారు. అప్పటి నుండి ఉపాధ్యాయుల దినోత్సవం ప్రతి సంవత్సరం అయన జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లందరి గౌరవార్థం గుర్తించబడింది.


మనం గుర్తుచేసుకోవాల్సిన గురువులు ఎవరంటే..
మొట్ట‌మొద‌ట‌గా మ‌నం చెప్పుకోవ‌ల‌సిన‌, గుర్తు చేసుకోవ‌ల‌సిన గురువు జ‌గ‌ద్గురువు శ్రీ‌కృష్ణ‌ప‌ర‌మాత్ముడు. ఈ జాతికి భ‌గ‌వ‌ద్గీత‌ను బోధించిన గురువు ఆ న‌ల్ల‌న‌య్య‌, ఒక్క భ‌గ‌వ‌ద్గీత‌తో అర్జునునిలోని అజ్ఞానాన్ని తొల‌గించాడు. కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. దుష్ట‌సంహారం చేయించాడు. కురు వృద్ధుడైన భీష్మాచార్యుడు స్వ‌యంగా శ్రీ‌కృష్ణుడిని జ‌గ‌ద్గురువు అని సంబోధించాడు.


తర్వాత మనం చెప్పుకోవల్సింది జగద్గురు ఆదిశంకరాచార్యులు. 32 సంవత్సరాల వయసులో తనువు చలించిన ఎంతో మంది శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. దేశవ్యాప్తంగా  శ‌క్తి పీఠాలు స్థాపించి, జ్ఞాన‌తృష్ణ ఉన్న‌వారికి ప‌రోక్షంగా గురువుగా నిలిచారు. మ‌రో జ‌గ‌ద్గురువు స్వామి వివేకానందుడు. రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసి, ఆయ‌న ద‌గ్గ‌ర జ్ఞాన స‌ముపార్జ‌న చేసి, గురువుల సందేశాల‌ను యావ‌త్ప్ర‌పంచానికి అందించి, అతి పిన్న‌వ‌య‌సులోనే క‌న్నుమూశాడు వివేకానందుడు. అయితేనేం నేటికీ వివేకానందుడు ఎంతోమందికి గురువుగా ప‌రోక్షంగా జ్ఞాన‌భిక్ష ప్ర‌సాదిస్తున్నాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook