These 3 Zodiac Sign peoples will get Unexpected Money due to Budhaditya Rajyog 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... ఒక గ్రహం రాశి చక్రంలో సంచరించినప్పుడల్లా దాని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. గ్రహాల రాజు 'సూర్యుడు' ప్రతి నెలా తన స్థానాన్ని మార్చుకుంటాడు. ఈ క్రమంలో 2023 జనవరి 14న మకర రాశిలోకి సూర్యుడు (SunTransit 2023) ప్రవేశిస్తాడు. ఈ రోజును 'మకర సంక్రాంతి' అని పిలుస్తారు. అదే సమయంలో 2023 ఫిబ్రవరి 7న బుధ గ్రహం (Mercury Transit 2023) కూడా ధనుస్సు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తుంది. మకర రాశిలో అప్పటికే సూర్యుడు ఉండగా.. బుధుడు కూడా ప్రవేశిస్తాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు, సూర్యుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు 'బుధాదిత్య రాజయోగం' (Budhaditya Rajyog In Capricorn) ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ రాజయోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాదు ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బుధాదిత్య రాజయోగం సమయంలో అనేక రాశుల వారి గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఈ యోగం ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.


మకర రాశి (Capricorn):
మకర రాశిలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. కాబట్టి మకర రాశి వారికి ఈ సమయం ప్రత్యేక ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాజయోగం మకర రాశి రెండవ ఇంట్లో ఏర్పడబోతోంది. దాంతో ఆకస్మిక లాభం ఉండవచ్చు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంబంధిత విషయాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారు డబ్బు సమస్య నుంచి బయటపడతారు.


మీన రాశి (Pisces):
మీన రాశి వారు సూర్యుడు మరియు బుధ గ్రహాల కలయిక వల్ల కూడా విశేష ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశుల వారికి ఆదాయ పరంగా బుధాదిత్య రాజయోగం శుభప్రదంగా ఉండబోతోందది. మీన రాశి వారి జాతకంలో 11వ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. దాంతో మీన రాశి వారి ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది.పెట్టుబడికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి కూడా ప్రయోజనాలను పొందవచ్చు. ఊహించని డబ్బు సొంతం అవవుతుంది. 


వృషభ రాశి (Taurus):
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి బుధాదిత్య రాజయోగంతో మంచి రోజులు మొదలవుతాయి. వృషభ రాశి వారి జాతకంలో తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దాంతో ప్రతి పనిలో మీకు అదృష్టం ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనే కోరిక త్వరలో నెరవేరుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో బాధ్యతను పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. డబ్బు కట్టలు లెక్కపెట్టడం కష్టమే. 


Also Read: Rishabh Pant BCCI: బీసీసీఐ మంచి మనసు.. ఐపీఎల్‌ 2023 ఆడకున్నా రూ.16 కోట్ల చెల్లింపు!  


Also Read: Virat Kohli: రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి! వాల్తేరు విరాట్‌ను చూసేయండి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.